శంక‌ర్ రెండు ప‌డ‌వ‌ల ప‌య‌నం ఎందాకా?

Update: 2022-10-09 09:30 GMT
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తున్నాడు. పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ RRRతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ని సంపాదించాడు. చ‌రణ్ కి ఇప్పుడు బ్రిట‌న్-అమెరికా-జ‌పాన్-కొరియా లోనూ భారీ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఇక‌పై చెర్రీ న‌టించే ప్ర‌తి సినిమాని వ‌ర‌ల్డ్ వైడ్ భారీగా రిలీజ్ చేసేందుకు స‌న్నాహ‌కాలు చేస్తున్నార‌ని స‌మాచారం. శంకర్ దర్శకత్వం వహిస్తున్న‌ RC15 ని పాన్ వ‌ర‌ల్డ్ రేంజులో విడుద‌ల చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్ర‌కారం.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ నేటి నుంచి (9 అక్టోబ‌ర్) రాజమండ్రిలో ప్రారంభమై ఐదు రోజుల పాటు సాగనుంద‌ని తెలిసింది. ఇదిలా ఉంటే ఈ పొలిటికల్ థ్రిల్లర్ నుండి చరణ్ ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చ‌ర‌ణ్ ఇందులో డ్యూయ‌ల్ షేడ్ ఉన్న పాత్ర‌ల‌ను పోషిస్తున్నాడు. ఐఏఎస్ ట‌ర్న్ డ్ ముఖ్య‌మంత్రిగా క‌నిపిస్తాడ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక పాత్ర‌లో నెగెటివిటీని కూడా శంక‌ర్ చూపించ‌బోతున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇందులో ఒక ఎత్తైన ఘాట్ ట్రాక్ ట‌న్నెల్ లోని  ట్రైన్ లో భారీ పోరాట సన్నివేశం మ‌రో లెవ‌ల్లో చిత్రీక‌రించార‌ని ఇంత‌కుముందు టాక్ వినిపించింది.

RC15 లో కియారా అద్వానీ కథానాయిక. SJ సూర్య- అంజలి- శ్రీకాంత్- నవీన్ చంద్ర- సునీల్ - జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ‌ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. థమన్‌ 50వ సినిమాగా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

సైమ‌ల్టేనియ‌స్ గా రెండు ప‌డ‌వ‌ల‌పై..!

శంక‌ర్ ఒకేసారి రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తుండ‌డం ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఓవైపు చెర్రీతో ఆర్.సి 15 .. మ‌రోవైపు భార‌తీయుడు 2 కోసం అతడు త‌న షెడ్యూళ్ల‌ను కేటాయించ‌డం ఆస‌క్తిక‌రం. శంక‌ర్ కెరీర్ లోనే తొలిసారి ఇలాంటి స‌న్నివేశం ఎదురైంది. దీనికి కార‌ణాలు తెలిసిన‌వే. కమల్ హాసన్ - శంకర్ కాంబినేష‌న్ లో 1996లో వచ్చిన సోష‌ల్ డ్రామా బార‌తీయుడు (ఇండియన్) సీక్వెల్ ర‌క‌ర‌కాల ఇబ్బందుల న‌డుమ‌ తెర‌కెక్కుతున్న‌ సంగ‌తి తెలిసిందే.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ కాంబినేష‌న్ సీక్వెల్ ని శంక‌ర్ ప్రారంభించారు. 2017లో సీక్వెల్ ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. అయితే 2020లో దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. క్రేన్ యాక్సిడెంట్ సిబ్బంది మరణానికి దారితీసింది. ఆ త‌ర్వాత మొద‌లైనా కానీ ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఈ ప్రాజెక్ట్ కి ప‌దే ప‌దే బ్రేక్ ప‌డ‌డం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. కరోనా క్రైసిస్ స‌హా కోర్టు గొడ‌వ‌లు కూడా డిలే అవ్వ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి.

ఇక‌ ఈ ఏడాది ఆగస్టు 24 నుంచి పెండింగ్ చిత్రీక‌ర‌ణ ప్రారంభించారు. ఆ త‌ర్వాత చ‌ర‌ణ్ ఆర్.సి 15 షెడ్యూల్స్ కి బ్రేక్ ప‌డింది. 2.0 ఫ్లాపైన త‌ర్వాత శంక‌ర్ కెరీర్ కి ఈ రెండు సినిమాలు ఎంతో కీల‌కం. ఇప్పుడు ఒకేసారి భార‌తీయుడు 2తో పాటు ఆర్.సి 15 సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఇరు సినిమాల కోసం త‌న షెడ్యూళ్లను స‌ర్ధుబాటు చేస్తున్నారు. భారీ విజ‌యాల‌తో అతడు కంబ్యాక్ అవుతాడ‌నే అభిమానులు భావిస్తున్నారు.
Tags:    

Similar News