శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న `భారతీయుడు-2` సినిమా చిత్రీకరణ సందర్భంగా ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేస్తుండగా 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ విరిగిపడడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ఘటనలో శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు - అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ - ఫుడ్ సప్లయర్ చంద్రన్ మృతిచెందడంతో చిత్ర యూనిట్ షాక్ కు గురైంది. ఈ దుర్ఘటనపై కమల్ హాసన్ తో పాటు కోలీవుడ్ - టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఆ దుర్ఘటనపై దర్శకుడు శంకర్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. ఆ రోజు క్రేన్ తనమీద పడి ఉన్నా బాగుండేదని, తానింకా ఆ షాక్ నుంచి తేరుకోలేదని శంకర్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
`భారతీయుడు-2` సినిమా కోసం సెట్ వేస్తున్న సమయంలో క్రేన్ తెగిపడి 150 అడుగుల పైనుంచి కిందపడిన ఘటనో కోలీవుడ్ లో కలకం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి హీరో కమల్ హాసన్ - దర్శకుడు శంకర్ కొద్దిలో తప్పించుకున్నారు. ఆ ప్రమాదం తర్వాత షాక్ లో ఉన్న శంకర్ తాజాగా ఆ దుర్ఘటనపై స్పందించాడు. అత్యంత బాధాతప్త హృదయంతో ఈ ట్వీట్ చేస్తున్నానని, ప్రమాదం జరిగినప్పటి నుంచి తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని శంకర్ అన్నారు. తన అసిస్టెంట్ డైరెక్టర్ - ఇతర సిబ్బందిని కోల్పోవడం చాలా బాధగా ఉందని శంకర్ ట్వీట్ చేశారు. ఆ ప్రమాదం నుంచి తాను త్రుటిలో తప్పించుకున్నానని - ఆ క్రేన్ వారిపై కాకుండా తనపై పడినా బాగుండేదని అన్నాడు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని - వారి కుటుంబాలకు ఆ భగవంతుడి అండ ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశాడు.