సమంత లాగానే అరుదైన వ్యాధితో బాధపడుతున్న యంగ్ డైరెక్టర్..!

Update: 2022-11-05 02:30 GMT
రీల్ లైఫ్ కు... రియల్ లైఫ్ కు చాలా తేడా ఉంటుంది. రీల్ లైఫ్ లో హీరో హీరోయిన్లు అనుకున్నది చిటికెలో చేసేస్తుంటారు. ఒక్క పాటలోనే కోటీశ్వరుడు కావడం.. పెళ్లి.. పిల్లలు వగైరా వంటివి జరిగిపోతుంటాయి. దీన్ని చూసి ఆడియన్స్ ఆహో.. ఓహో అంటూ కేరింతలు కొడుతుంటారు. అయితే రియల్ లైఫ్ ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

మనకు మాదిరిగానే సినీ నటులకు చాలా కష్టాలు ఉంటాయి. అయితే వాటిని బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. పర్సనల్ విషయాలు బయటికి చెప్పడం వల్ల తమకు నష్టమే తప్ప లాభం లేదని అనుకుంటారు. అయినప్పటికీ కొన్ని విషయాలు మీడియాలో లేదా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వీటిపై కొందరు స్పందిస్తే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటుండటం కన్పిస్తోంది.

సమంత-నాగచైతన్య విడాకుల ఇష్యూ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. విడాకుల తర్వాత వీరిద్దరు ఎవరి సినిమాల్లో వారు నటిస్తూ బీజిగా మారిపోయింది. అయితే ఇటీవల సమంత మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధిన బారిన పడ్డారు. ఈ విషయాన్ని సమంత స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఎక్కువగా ఆలోచించడం వల్లే సమంత డిప్రెషన్ లోనైందని.. అందువల్లే ఈ వ్యాధి ఆమెకు వచ్చిందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. లక్షలో ఒకరికి మయోసైటిస్ వ్యాధి వస్తుందట. సరైన మందులు వాడితే ఈ వ్యాధి తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. తాజాగా ఇలాంటి అరుదైన వ్యాధి మరో డైరెక్టర్ కు ఉందని వెల్లడికావడం చర్చనీయాంశంగా మారింది.

దర్శకుడు అనుదీప్ 'పిట్టగోడ' మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేక పోయినా ఆ తర్వాత వచ్చిన 'జాతిరత్నాలు' సూపర్ హిట్ అయింది. ఈ మూవీ సక్సస్ తో ఆయనకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. తమిళ హీరో శివ కార్తీకేయన్ తో  అనుదీప్ చేసిన 'పిన్స్' మూవీని ఇటీవలే విడుదలైంది

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనుదీప్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఉన్న అరుదైన వ్యాధి గురించి వెల్లడించాడు. తాను హైలీ సెన్సీటీవ్‌ పర్సన్‌(హెచ్‌ఎస్‌పీ) వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపాడు. ఈ వ్యాధి లక్షణాలు చాలామందిలో కనిపిస్తూ ఉంటాయని వీటిని ఎవరూ ఎక్కువగా పట్టించుకోరని తెలిపాడు.

తనకు గ్లూటెన్‌ పడదని.. కాఫీ తాగితే రెండు రోజులపాటు నిద్ర పట్టదని వాపోయాడు. ఏదైనా జ్యూస్ తాగితే తిరిగి తన మైండ్‌ కామ్‌ అవుతుందన్నాడు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారికి సెన్సెస్‌ చాలా స్ట్రాంగ్‌గా పని చేస్తాయని తెలిపాడు. ఎక్కువ లైటింగ్ చూసినా.. ఘాటైన వాసనలు పీల్చిన తట్టుకోలేరని.. త్వరగా అలిసి పోతారన్నారు.

అందువల్లే తాను అప్పుడప్పుడు సీరియస్ గా కన్పిస్తానని తెలిపారు. తనకు ఉన్న ఈ వ్యాధిపై త్వరలో ఓ సినిమా కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు అనుదీప్ చెప్పడం విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News