2007 సంవత్సరంలో మున్నా సినిమాతో దర్శకుడిగా కెరీర్ ను ప్రారంభించిన వంశీ పైడిపల్లి ఇప్పటి వరకు చేసిన సినిమాలు కేవలం అయిదు మాత్రమే. రెండేళ్లకు కనీసం ఒక్క సినిమాను కూడా తీసుకు రాలేక పోతున్న వంశీ పైడిపల్లి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినిమాల ఆలస్యంకు కారణం వెళ్లడించాడు. కథల విషయంలో తాను వెంటనే నిర్ణయం తీసుకోలేక పోవడం వల్లే తక్కువ సినిమాలు చేసినట్లుగా పేర్కొన్నాడు. తనకు కథలు రాయడం రాదని.. కథల కోసం ఇతర రచయితల మీద ఆధారపడాల్సి వస్తుంది. అందుకే సినిమాలు ఆలస్యం అవుతున్నాయని ఈ సందర్బంగా వంశీ పేర్కొన్నాడు.
2019 లో మహర్షి సినిమా తో వచ్చిన వంశీ తన తదుపరి సినిమాను ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. ఇటీవలే తమిళ సూపర్ స్టార్ విజయ్ తో దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా కన్ఫర్మ్ అయ్యిందని ప్రకటించాడు. వంశీ పైడిపల్లి తదుపరి సినిమా షూటింగ్ ప్రారంభంకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కనుక ఈ గ్యాప్ లో ఆ తర్వాత సినిమా కోసం కథను సిద్దం చేస్తున్నట్లుగా వంశీ పేర్కొన్నాడు. విజయ్ తో సినిమాను పూర్తి చేసిన తర్వాత మరో కొత్త సినిమాను మొదలు పెట్టేందుకు గాను ఆయన ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్న కారణంగా ఈసారి మరీ ఆలస్యం జరగదని అంటున్నారు.
మహేష్ బాబుతో మహర్షి సినిమా చేసిన వెంటనే తదుపరి సినిమాను కూడా ఆయనతోనే చేయాల్సి ఉన్నా కూడా కథ సెట్ అవ్వక పోవడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. మరి విజయ్ తో సినిమా తర్వాత అయినా వంశీ తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేస్తాడేమో చూడాలి. కథల విషయంలో ఆలస్యం అంటూ ఓపెన్ గా చెప్పేసిన వంశీ పైడిపల్లి ఇక పై కథల విషయంలో మరింత ఆలస్యం జరుగకుండా చూసుకుంటానంటూ ఏడాదికి కనీసం ఒక సినిమాను అయినా విడుదల చేసేలా ప్లాన్ చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. విజయ్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి అవ్వాలంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. కనుక ఈ గ్యాప్ ను వంశీ మరో సినిమా కథకు వినియోగించుకుంటాడేమో చూడాలి.