చౌదరి.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో అతనొకడు. అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ లాంటి పెద్ద స్టార్లతో క్రేజీ సినిమాలు తీశాడతను. ఐతే చౌదరి కెరీర్ ఎప్పుడూ ఒకలా లేదు. ఒకసారి కింద పడతాడు. తర్వాత పైకి లేస్తాడు. మళ్లీ పడతాడు.. మళ్లీ లేస్తాడు. ఇలాగే కెరీర్ ను ముందుకు నడిపిస్తూ వెళ్లాడు కానీ.. ‘రేయ్’ కొట్టిన దెబ్బకు మాత్రం చౌదరి మళ్లీ కోలుకోలేదు. ఆ సినిమాతో టాలీవుడ్లో అతడి అడ్రస్ గల్లంతయిపోయింది. సాయిధరమ్ తేజ్ లాంటి కొత్త హీరోను పెట్టి అయినకాడికి ఖర్చు చేయడం.. సినిమా ఏళ్లకు ఏళ్లు ఆలస్యం కావడంతో చౌదరి మునిగి పోయాడు. ఈ సినిమా మిగిల్చిన నష్టాలతో తన థియేటర్లను కూడా అమ్ముకోవాల్సిన స్థితికి చేరుకున్న చౌదరి.. మళ్లీ ఎంత ప్రయత్నించినా కొత్త సినిమాను మొదలుపెట్టలేకపోయాడు.
రేయ్ తర్వాత కొన్నిసార్లు మీడియాను కలిసినపుడు, ఏదైనా సినిమా వేడుకల్లో పాల్గొన్నపుడు తన రీఎంట్రీ గురించి మాట్లాడేవాడు చౌదరి. కానీ ఈ మధ్య పూర్తిగా అతను మీడియాకు దూరమైపోయాడు. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో అతడి ఊసే లేదు. ఇలాంటి టైంలో చాలా గ్యాప్ తర్వాత చౌదరి లైన్లోకి వచ్చాడు. శనివారం తన పుట్టిన రోజు నేపథ్యంలో ముందు రోజు ఒక పెద్ద నోట్ ఇచ్చాడు వైవీఎస్. అందులో కరోనా వల్ల సినీ పరిశ్రమ పడుతున్న కష్టాల గురించి చెప్పి.. గతంలో ఎన్నో సమస్యల్ని అధిగమించిన పరిశ్రమ దీన్ని కూడా విజయవంతంగా అధిగమిస్తుందని చెప్పాడు. ఇక తన కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. తాను ఏ ప్రయత్నం చేసినా వెన్నంటి ఉంటామంటూ మిత్రులు, శ్రేయోభిలాషులు చెబుతున్నారని వైవీఎస్ అనడంతో కొత్త సినిమా కబురేమైనా చెబుతాడేమో అనిపించింది. కానీ ఆ సంగతి ఏమీ తేల్చకుండా సినీ పరిశ్రమకు మళ్లీ మంచి రోజులు వస్తాయంటూ ఈ సుదీర్ఘమైన నోట్‌ను ముగించాడు. చాలా వరకు తన గత వైభవం గురించి చెప్పుకుని మురిసిపోయిన చౌదరి.. ఇంతకీ కొత్త సినిమా మొదలెట్టబోతున్నట్లా లేనట్లా?