మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఉప్పెన'. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ కరోనా కారణంగా వీలు పడలేదు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'ఉప్పెన' సినిమాకి మేకర్స్ భారీగానే ఖర్చు చేశారని టాక్ నడుస్తోంది.
కాగా, మెగా హీరో లాంచ్ మూవీ కావడంతో ప్రొడ్యూసర్స్ 'ఉప్పెన' విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవడంతో పాటు అనేకసార్లు రీ షూట్ కూడా చేసారని ఇండస్ట్రీ వర్గాల్లో అంటున్నారు. దీని కారణంగానే ఈ మూవీకి బడ్జెట్ ఎక్కువైందని.. ఓటీటీలు ఆ రేంజ్ లో ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో డీల్ కుదరలేదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఉప్పెన టీమ్ కాస్త టైం తీసుకొనైనా ఈ చిత్రాన్ని ఇంకా ట్రిమ్మింగ్ చేసే ఆలోచన చేస్తున్నారట. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో హీరో తరుపు వారికి ప్రొడక్షన్ వారికి, డైరెక్షన్ టీమ్ కి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయట. ఈ సినిమాలో క్లైమాక్స్ ని ఆడియెన్స్ పాజిటివ్ గా ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆలోచనతోనే ఇన్నాళ్లు రీ షూట్స్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. మరి మెగా మేనల్లుడి ఫస్ట్ సినిమా ఏ వేదికపై రిలీజ్ అవుతుందో క్లారిటీ వచ్చి ఉప్పెన తీరం ఎలా దాటుతాడో చూడాలి.