సోషల్ మీడియా ఎంట్రీతో మీడియా చిన్నబోతోంది. గతంలో ఇన్ఫర్మేషన్ అంటే మీడియా అన్నట్లుండేది. ఇప్పుడు సీన్ మొత్తం రివర్ష్ అయి.. సోషల్ మీడియా నుంచే మీడియా న్యూస్ తీసుకోవటం పెరిగింది. సోషల్ మీడియాలో ప్రముఖమైన వాటిల్లో ట్విట్టర్ ఒకటన్న ముచ్చట తెలిసిందే.
గడిచిన ఏడాదిలో ట్విట్టర్ లో ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుకున్నారన్న విషయాన్ని చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపించక మానవు. కండల వీరుడు.. తరచూ వివాదాల్లో తలదూర్చే సల్మాన్ ఖాన్ ను కాదని.. బాలీవుడ్ బాద్షా షారూక్ గురించి ట్విట్టర్ లో ఎక్కువ మంది మాట్లాడుకున్నారట. ఏడాది మొత్తంలో షారూక్ 36 శాతం మాటలు సాగితే.. సల్మాన్ గురించి కేవలం 18 శాతం మందే మాట్లాడుకున్నారట.
హీరోల విషయాన్ని పక్కన పెట్టి.. హీరోయిన్ల గురించి చూస్తే.. బేవాచ్ బ్యూటీ ప్రియాంక గురించే ఎక్కువ మాటలు సాగాయట. ప్రియాంక గురించి 23 శాతం మంది మాట్లాడుకుంటే.. ఆ తర్వాతి స్థానంలో అలియా భట్ నిలిచిందట. ఆ తర్వాత స్థానాల్లో దీపికా పదుకొణె.. అనుష్క శర్మ.. శ్రద్ధా కపూర్.. కాజోల్.. జాక్వలిన్ ఫెర్నాండెజ్.. పరిణితీ చోప్రా లాంటోళ్లు ఉన్నారు. గత ఏడాది తాను చేసిన దిల్ హై ముష్కిల్ సినిమాతో న్యూస్ లో తరచూ హడావుడి చేసిన ఐశ్వర్య ఆంటీ గురించి ట్విట్టర్ లో పెద్దగా మాట్లాడుకోకపోవటం గమనార్హం.