ముంబైలో దేవ‌ర‌కొండ‌..బాలీవుడ్ మేక‌ర్స్ తో చ‌ర్చ‌లా?

Update: 2022-11-26 07:30 GMT
'లైగ‌ర్' ప్లాప్  త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌లో మునుప‌టి అంత‌ ఎనర్జీ క‌నిపించ‌లేదు. ఆ సినిమా వైఫ‌ల్యం స‌హా..రిలీజ్ కి ముందు దేవ‌ర‌కొండ చేసిన కొన్ని  వ్యాఖ్య‌లు  సోష‌ల్ మీడియాలో కాక పుట్టించిన  వైనంతో ఒక్క‌సారిగా వేగం త‌గ్గిన‌ట్లు క‌నిపించింది.  ఆవెంట‌నే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఖుషీ సినిమాలో షూట్ లో జాయిన్ అయిపోయాడు. అప్ప‌టి నుంచి మ‌రో మాట లేకుండా త‌న ప‌ని తాను చూసుకోవ‌డం త‌ప్ప‌! సోష‌ల్ మీడియాలో కూడా క‌నిపించ‌లేదు.

సినిమా అప్ డేట్స్  ఏవైనా నిర్మాణ సంస్థ నుంచి రావడం త‌ప్ప దేవ‌ర‌కొండ  వ్య‌క్త‌గ‌తంగా ఎలాంటి స‌మాచారం పాస్ చేయ‌డం లేదు. దీంతో  దేవ‌ర‌కొండ ఇంత సైలైంట్ అయిపోతే ఎలా? అంటూ  అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయినా నో రిప్లై..మీరు ప‌ని మీరు చూసుకోండి...నా ప‌ని  నేను చేసుకుటాను అన్న‌త‌ర‌హాలో వైఖ‌రి క‌నిపిస్తుంది.

తాజాగా ఈ హీరో ముంబైలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు.  థ‌మ్స్ అప్ యాడ్ షూట్ కోసం ముంబైకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మోహ‌బూబా స్టూడియోల్ షూట్ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ ఓ బాలీవుడ్ ద‌ర్శ‌కుడిని సైతం క‌లిసే ప్లాన్ లో ఉన్న‌ట్లు లీకులందుతున్నాయి.

దీంతో ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రై ఉంటారు? అన్న ఆస‌క్తి నెల‌కొంది. ఏదైనా ప్రాజెక్ట్ కోసం క‌ల‌వాల‌నుకుంటున్నాడా?  స్నేహ పూర్వ‌కంగా మీట్ అవుతున్నాడా? అన్న దానిపై ఎగ్టైట్ మెంట్ క‌నిపిస్తుంది.

బాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో అత‌నికి బాగా ర్యాపో ఉన్న‌ది ఒక్క క‌ర‌ణ్ జోహార్ తోనే . 'లైగ‌ర్' సినిమా నిర్మాణంలో క‌ర‌ణ్ భాగ‌స్వామి కావ‌డంతో అత‌నితో  స్నేహం మొద‌లైంది. విజ‌య్ తో ఓ హిందీ సినిమా కూడా నిర్మించ‌డానికి రెడీ అయ్యారు.

ఈ నేప‌థ్యంలో అత‌న్నే క‌లుస్తున్నాడా? అని కొంత మంది సందేహిస్తున్నారు. ఇదే నిజ‌మైతే క్రేజీ స‌మాచార‌మే.  బాలీవుడ్ హీరోలంతా తెలుగు వూపు చూస్తోన్న  త‌రుణంలో విజ‌య్ హిందీపై క‌న్నేయ‌డం ఆస‌క్తిక‌ర‌మే అవుతుంది.  మ‌రి అస‌లు సంగ‌తేంటి? అన్న‌ది తెలియాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News