ఫోటో స్టోరి: బిగువుల్లో న‌య‌గ‌రా ఫాల్స్

Update: 2018-12-03 14:07 GMT
కాటుక క‌ళ్లు.. విప్పారిన దోర దొండ‌ పెద‌వులు.. తీరైన కురులు..
భుజాల‌పై జారిపోతున్న క‌లువ రేకుల‌ డిజైన‌ర్ ఛ‌మ్మీ డ్రెస్..
రెండు కొండల మ‌ధ్య జాలువారుతున్న న‌య‌గ‌రా జ‌ల‌పాతం!!
ఆ మోములో చిరున‌వ్వు బోన‌స్ అనుకోండ్రి!!
టిక్ టిక్ టిక్.. ల‌బ్ డ‌బ్!! గుండె ల‌య త‌ప్పుతోందా?

ఇల‌లో ఇంతంద‌మా? అన్నంతగా ముద్దొచ్చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవ‌రో తెలుసు కదా..?  సీకే బ్రాండ్‌కే చెమ‌ట‌లు ప‌ట్టించిన లోఫ‌ర్ బ్యూటీ దిశాప‌టానీని ఇంతందంగా కూడా ఇంట్ర‌డ్యూస్ చేయొచ్చు. తాను ఏ మూస‌లోకి పోస్తే ఆ మూస‌లో ఒదిగిపోయే అంద‌గ‌త్తె కాబ‌ట్టే బాలీవుడ్ కి కూడా చెమ‌ట‌లు ప‌డుతున్నాయ్. దిశా కోస‌మే కొన్ని పాత్ర‌ల్ని క్రియేట్ చేయాలేమో అన్నంత‌గా ఈ అమ్మ‌డి అంద‌చందాలు, వ‌న్నె చిన్నెలు యువ‌త‌రంలో హాట్ టాపిక్ అవుతున్నాయి. పెళ్లి పీసీది అయితే, ఈవిడ గారి సంద‌డేంటో కానీ, అబ్బో.. అక్క‌డ చుట్టాల చూపుల‌న్నీ ఈ సోయ‌గంపైనే! అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. హిమాల‌యాల్లోని మాన‌స‌స‌రోవ‌రం నుంచి దారి త‌ప్పి వ‌చ్చిన హంస‌రాణిలా హింసించిందంతే.

దిశా న‌టిస్తున్న ఏకైక క్రేజీ సినిమా భ‌ర‌త్. స‌ల్మాన్ భాయ్, క‌త్రిన లాంటి స్టార్ల న‌డుమ త‌నకంటూ ఓ గుర్తింపు కోసం చాలానే పాకులాడుతుంద‌న‌డంలో సందేహం లేదు. మ‌రోవైపు పెళ్లిళ్లు, ప‌బ్బాల‌కు ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్‌తో క‌లిసి వెళుతూ, లేదా విడివిడిగా ప్లాన్ చేసి, ఎవ‌రికీ ఏమీ తెలియ‌న‌ట్టు క‌ల‌రింగ్ ఇస్తూ అక్క‌డ క‌లుస్తూ బాగానే ఎంజాయ్ చేస్తోంది.
Tags:    

Similar News