ఫోటోటాక్: బికినీలో దిశా ప‌టానీ స్ట‌న్నింగ్ లుక్

Update: 2022-04-18 07:43 GMT
అందాల దిశాపటానీ ముంబై ఫ్యాషన్ ప్రపంచంలో ఎదురేలేకుండా దూసుకుపోతుందనడంలో సందేహం లేదు. ఈ భామ ఎక్కడ ఉన్నా - అక్కడ ఫ్యాషనిస్టాలు ఆగి చూడాల్సిందే. ఇదివరకెన్నడూ ఇలాంటి ఫ్యాషన్ చూడలేదంటూ ఆ కొత్తదనానికి మురిసిపోవాల్సిందే. నిరంతరం ఏదో ఒక ఫోటోషూట్తో సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు టచ్ లో ఉంటూనే ఉంది కాబట్టి దిశా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఎప్పటికప్పుడు వేడెక్కించే ఫోటోల్ని ఇన్ స్టాగ్రమ్ లో అప్ లోడ్ చేస్తూ హడావుడి చేస్తుంటుంది.

వాటిలోనూ త‌న‌దైన మార్క్ వేసేలా జాగ్ర‌త్త‌ప‌డుతుంది. రొటీన్ కి భిన్న‌మైన టెంప్టింగ్ ఫోజుల‌కు దూరంగా ఉంటూ స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. ఇక బికినీ దుస్తుల్లో అమ్మ‌డు ట్రై చేసిన  డిజైన‌ర్ వేర్స్  గురించి అయితే చెప్పాల్సి ప‌నిలేదు. తాజాగా మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్నంతో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటుంది. దిశ హాట్ ఫోటో ఒక‌టి నెట్టింట దుమారం రేపుతోంది. డార్క్ ఆరెంజ్ క‌ల‌ర్ డిజైన‌ర్ బికినీలో అమ్మ‌డు కెమెరాకి  ఇచ్చిన ఫూజులు చూస్తే స్టన్ అవ్వాల్సిందే.

రిసార్స్ట్  బాల్క‌నీలో దిశా ఇలా స్టాండింగ్ పోజిష‌న్ లో క్యామ్ కి ఫోజులిచ్చింది. వ‌య్యారంగా నుంచోని అందాలు ఆరబోస్తూ ఆక‌ట్టుకుంటుంది. సూర్యుడి స్పాట్ లైట్ ముఖంపై ప‌డేలా నుంచుని మంట‌లు రేప‌డం నెట్టింట హాట్ టాపిక్ మారింది. అభిమానులు ఎవ‌రి స్టైల్లో వారు కామెంట్ల‌తో చెల‌రేగుతున్నారు.

ఇక దిశా ప‌టాని సినిమాల విష‌యానికి మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `లోఫ‌ర్` సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ కి ప‌రిచయ‌మైన సంగ‌తి తెలిసిందే. కానీ ఆ సినిమా అంచ‌నాల్ని అందుకోలేదు.

దీంతో అమ్మ‌డు బాలీవుడ్ లోనే స్థిర‌ప‌డింది. ప్ర‌స్తుతం అక్క‌డ బిజీ న‌టిగా కొన‌సాగుతుంది. యువ హీరోల నుంచి సీరియ‌ర్ హీరోల వ‌ర‌కూ అంద‌రి స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటోంది. ప్ర‌స్తుతం మోహిత్ సూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న  `ఏక్ విలన్ 2` లో న‌టిస్తోంది.

ఈ యాక్షన్ చిత్రంలో తారా సుతారియా- అర్జున్ కపూర్ - జాన్ అబ్రహం నటించారు. ఏక్తా కపూర్ చిత్రం `కే-టీనా` కూడా చిత్రీకరణలో ఉంది. ఇంకా పలు ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తోంది. అటు ప్రియుడు టైగ‌ర్ ష్రాప్ తో సీరియ‌స్ రిలేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు  ప్రేమ స్టేజ్ ని దాటి పెళ్లి వ‌ర‌కూ వెళ్తున్నార‌ని ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News