భారీ బడ్జెట్ సినిమాలంటే ఈ రోజుల్లో ఇండియాలో ఎక్కువగా హిస్టారికల్ మూవీస్ వస్తున్నాయి. అలనాటి రాజుల రాణుల చరిత్రలను చూపించాలంటే ఊహకందని రేంజ్ లో తెరకెక్కించాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. డబ్బుకంటే సమయం కూడా చాలా ఎక్కువా వెచ్చించాలి. అన్ని బరువులతో కూడుకున్న సినిమాను తెరకెక్కించాలంటే తప్పకుండా అన్ని సిద్దమైన తర్వాతనే షూటింగ్ స్టార్ట్ చెయ్యాలి.
కానీ 200 కోట్ల భారీ బడ్జెట్ సినిమా ను తెరకెక్కించబోయే ఓ చిత్ర యూనిట్ ఏమాత్రం జాగ్రత్త వహించడం లేదు. ఆ సినిమా మరేదో కాదు తమిళ్ లో సుందర్ సి తెరకెక్కిస్తున్న "సంఘమిత్ర". మొదట రూ.150 కోట్ల బడ్జెట్ తో అనుకున్నారు కానీ కథ డిమాండ్ చేస్తోందని రూ.200 కోట్లకు పెంచారు. ఇక టైటిల్ రోల్ లో మొదట శృతి హాసన్ ని అనుకున్నారు. కానీ ఆమె సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ విషయంలో క్లారిటీ లేదని అలాగే కాల్షీట్స్ విషయంలో కూడా వారు ఒక నిర్ణయంతో లేరని శృతి తప్పుకుంది. దీంతో సినిమాకు బ్రేకులు పడినటయ్యింది. కానీ చిత్ర యూనిట్ ఆ తర్వాత అనుష్క - తమన్నా - నయనతారలని సలెక్ట్ చేశారని పలు రకాలుగా వార్తలు వచ్చాయి.
కానీ ఆ విషయం అధికారకంగా చెప్పలేదు. ఇక రీసెంట్ గా డైరెక్టర్ సుందర్ సి సతీమణి కుష్బూ.. లోఫర్ భామ దిషా పటాని సెలెక్ట్ అయ్యిందని చెప్పింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. సినిమా ఏంటి? ఆ బడ్జెట్ ఏంటి? ఎంచుకున్న కథానాయిక ఏంటి? అని పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా ఇటువంటి సినిమాలకు అనుభవం ఉన్న కథానాయికలు మరియు మార్కెట్ ఉన్న కథానాయికలు కావాలి. కానీ దిశా నాలుగు సినిమాలు కూడా తీయలేదు. అలాగే ఆ సినిమాలు కూడా అంతగా విజయాన్ని అందుకోలేదు మరి వీరి నిర్ణయాల వల్ల సినిమా ఉంటుందా ఊడుతుందా అనేది సందేహంగానే ఉంది.