ఇలియానా ప్లేస్‌ ని రీప్లేస్ చేసేట్టుందే

Update: 2015-11-12 07:30 GMT
స‌న్న‌జాజి సోయ‌గం ఇలియానా దేవ‌దాసు సినిమాతో టాలీవుడ్‌ లో నాయిక‌గా అడుగుపెట్టింది. ద‌శాబ్ధం పైగానే సౌత్‌ లో స్టార్ హీరోయిన్‌ గా వెలిగిపోయింది. అటుపై బాలీవుడ్ ఆశ‌ల‌తో ముంబై చెక్కేసింది., ఇప్పుడు అదే బాట‌లో  మ‌రో అమ్మ‌డు అవే ఫీచ‌ర్స్‌ తో క‌నిపిస్తూ టాలీవుడ్‌ లో హ‌ల్‌ చ‌ల్ చేస్తోంది. చూడ‌టానికి అచ్చం ఇలియానాకి చెల్లాయిలా క‌నిపిస్తున్న ఈ అమ్మ‌డు టాలీవుడ్‌ లో మ‌రో ఇలియానాగా పాపుల‌ర్ అవుతుందా? అన్న డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. చూపుల‌తో గుచ్చి గుచ్చి చంపేస్తోంది. గ్లామ‌ర్‌ లో ఇలియానాని కొట్టేసేట్టే క‌నిపిస్తోంది,. అస‌లింత‌కీ అమ్మ‌డి పేరేమి...? .. దిశాప‌టానీ, ఫ్రం ముంబై. అక్క‌డ టాప్ మోడ‌ల్‌.

టాలీవుడ్‌ లో ఆరంగేట్ర‌మే ఈ అమ్మ‌డు మెగా హీరో వ‌రుణ్‌ తేజ్ స‌ర‌స‌న లోఫ‌ర్ చిత్రంలో న‌టించింది. టాప్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ దృష్టిలో ప‌డి ఈ చిత్రానికి ఎంపికైంది. మిస్ ఇండియా బ్యూటీ కాంటెస్టెంటుగా స్విమ్‌ సీట్‌ లతో అద‌ర‌గొట్టేసిన ఈ అమ్మ‌డు ముంబైలో సూప‌ర్‌ మోడ‌ల్‌ గా ఎదిగింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ యంగ్ హీరో టైగ‌ర్ ష్రాప్‌ తో డేటింగ్ చేసింది. ఇప్పుడు టాలీవుడ్‌ లోకి దూకుడుగా వ‌చ్చేసింది. ఇక్క‌డ టాప్ డైరెక్ట‌ర్స్‌ తో మంత‌నాలు సాగిస్తోంది. ఆరంభ‌మే వ‌రుణ్‌-పూరిల‌తో అవ‌కాశం. ఇది క్లిక్క‌యితే ఇక అమ్మ‌డి కెరీర్ ఎక్క‌డికో వెళ్లిన‌ట్టే. ఇవిగో ఈ లేటెస్ట్ ఫోటోస్ చూస్తే దిశా రేంజు ఎలా ఉంటుందో మీరే చెప్పేయొచ్చు. సెగ‌లు రేపే ఈ ఫోజుల‌తో మ‌న కుర్రాళ్ల‌కు ఇట్టే హీట్ పుట్టించేస్తుంది కాబ‌ట్టి దిశా ప‌టానీ .. కి తిరుగే లేద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఇలియానా ఎలానూ లేదు. ఆ ప్లేస్‌ ని రీప్లేస్ చేస్తుందేమో చూడాలి. అదీ మ్యాట‌ర్‌.

Tags:    

Similar News