నన్నొక బేబీలా ట్రీట్‌ చేశారండీ!!

Update: 2015-12-17 04:16 GMT
ముంబై నుంచి టాలీవుడ్ వ‌చ్చి వాలింది దిశా ప‌టానీ. అందరు ముంబై బొమ్మ‌ల్లానే త‌ను కూడా ఓ రేంజులో కెరీర్‌ ని ఊహించుకుంటోంది. తొలి ప్ర‌య‌త్న‌మే టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ తో ప‌నిచేసే ఛాన్స్ ద‌క్కింది. కాబ‌ట్టి ఎంతో ఉల్లాసంగా ఉద్వేగంగా వెయిటింగ్ చేస్తోంది. తొలి సినిమా లోఫ‌ర్ పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న ఎగ్జ‌యిట్‌ మెంట్‌ లో ఉంది.

అంతేనా ఈ సినిమా ఆన్‌ సెట్స్ అనుభ‌వాల గురించి చెబుతూ .. ''నాకు భాష రాదు. కానీ తెలుగు ప‌దాల‌కు అర్థాలు ముందే తెలుసుకున్నా. అలా తెలుసుకున్న‌ప్పుడు నాకు ఓ సంగ‌తి అర్థ‌మైంది. పూరి జ‌గ‌న్నాథ్ ది బెస్ట్ రైట‌ర్‌. సౌత్‌ లోనే గొప్ప ర‌చ‌యిత‌. డైలాగులు అద్భుతంగా రాస్తారాయ‌న‌. వాస్త‌వానికి నేను రెండేళ్ల క్రిత‌మే పూరి సినిమాలో న‌టించాల్సింది. కానీ కుద‌ర‌లేదు. ఇంత‌కాలానికి అవ‌కాశం వ‌చ్చింది. వెయిటింగ్ ప‌లించ‌డానికి ఇంకెంతో స‌మ‌యం లేదు'' అని చెప్పుకొచ్చింది.

ఆన్‌ సెట్స్‌ లో లోఫ‌ర్ టీమ్ న‌న్ను ఒక బేబిలా చూసుకుంది అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. టాలీవుడ్‌ లో వాతావ‌ర‌ణం త‌న‌కి బాగా న‌చ్చింద‌ని, మ‌రిన్ని తెలుగు సినిమాల్లో న‌టించాల‌నుంద‌ని చెప్పుకొచ్చింది.  బాగానే ఉంది అమ్మ‌డూ!!

Tags:    

Similar News