ఫోటో స్టోరి: ఇవేం కుక్క పాట్లు?

Update: 2019-05-05 14:30 GMT
మోడ‌ల్ ట‌ర్న్ డ్ హీరోయిన్ దిశా ప‌టానీ సోష‌ల్ క్వీన్ గా ఎంత స్పీడ్ మీద ఉంటుందో తెలిసిందే. ఓ అధికారిక స‌మాచారం ప్ర‌కారం.. ఈ అమ్మ‌డికి సోష‌ల్ మీడియాలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా 150 అభిమాన సంఘాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. అయితే అంత‌మందిని గంప‌గుత్త‌గా అల‌రించాలంటే సామాజిక మాధ్య‌మాల్లో ఎంత కంటెంట్ ఇవ్వాలో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే త‌న అభిమానుల్ని ఏమాత్రం నిరాశ‌ప‌ర‌చ‌కుండా దిశా రెగ్యుల‌ర్ అప్ డేట్స్ తో అంతే హీటెక్కిస్తూ నిరంత‌ర వార్త‌ల్లో నిలుస్తోంది. ఓవైపు బ్రాండ్ ప్ర‌చారం.. మరోవైపు స్వీయ ప్ర‌చారంతో దిశా ప్ర‌కంప‌నాలే సృష్టిస్తోంది. సునామీ స్పీడ్ తో సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ ని పెంచుకుంటోంది.

ఇక యంగ్ అండ్ ట్యాలెంటెడ్ టైగ‌ర్ ష్రాఫ్ తో దిశా ప్రేమాయ‌ణం గురించి తెలిసిందే.  టైగ‌ర్ తో ఆల్మోస్ట్ దిశా ప‌టానీ స‌హ‌జీవ‌నం చేస్తోంద‌ని.. తొంద‌ర్లోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చార‌మైంది. ష్రాఫ్ బోయ్ తో రెగ్యుల‌ర్ గా ముంబై బాంద్రా స‌హా ఖ‌రీదైన ఏరియాల్లో దిశాతో క‌లిసి డిన్న‌ర్ .. లంచ్ డేట్ ల‌తో బిజీగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. విదేశాల్లో జాలీ ట్రిప్ ల‌కు వెళుతున్నారు ఈ జోడీ. టైగ‌ర్ తో త‌న సాన్నిహిత్యం ఎన్నో సంద‌ర్భాల్లో బ‌య‌ట‌ప‌డింది. అయితే టైగ‌ర్ తో పాటు దిశాకి ఇదిగో ఇలాంటి ఓ ఫ్రెండ్ ఉన్నాడ‌ని ఎవ‌రికైనా తెలుసా? ఈ నాలుగు కాళ్ల ఫ్రెండ్ గెట‌ప్‌ ప్ర‌స్తుతం హాట్ టాపిక్.

హాలీవుడ్ టు బాలీవుడ్ .. అట్నుంచి ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లో సెల‌బ్రిటీల‌ను ప‌రిశీలిస్తే పెట్స్ (పెంపుడు జంతువులు)ని పెంచుకునే అల‌వాటు ఎంద‌రికో ఉంది. అలానే దిశా ప‌టానీ ఈ బ్లాక్ క‌ల‌ర్ బ్రాండెడ్ డాగ్ ని పెంచుకుంటోంది. దీని పేరు గోకు. బాంద్రాలో ఇలా ఓ పెట్ స్టోర్ కి వ‌చ్చి దీనికి అవ‌స‌ర‌మ‌య్యే స‌రంజామాని కొనుక్కుని తిరిగి ఇంటికి వెళుతోంది దిశా. ఆ సంద‌ర్భంలో ఇలా కెమెరా కంటికి చిక్కింది. దిశా రెగ్యుల‌ర్ గా టైట్ స్పోర్ట్స్ వేర్ లోనే ద‌ర్శ‌న‌మిస్తుంటుంది. ఇలా కుక్క కోసం బ‌య‌టికి వ‌చ్చిన‌ప్పుడు అదే గెట‌ప్ తో దిగిపోవాలా? అయినా గోకు ఒంటిపైనా ఆ డిజైన‌ర్ గ‌ళ్ల చొక్కాయ్ అవ‌స‌ర‌మా? అంటూ సోషల్ మీడియాలోనూ పంచ్ లు ప‌డిపోతున్నాయి. మ‌రీ అంత‌గా టైగ‌ర్ ష్రాఫ్ ని ముద్దాడేసిన‌ట్టే ఆ కుక్క‌ను కూడా అంతే ఇదిగా చూసుకుంటోందే అంటూ ఫ్యాన్స్ ప‌రాచికం ఆడుతున్నారు.

దిశాని కెరీర్ ప‌రంగా ప‌రిశీలిస్తే 2019 మోస్ట్ అవైటెడ్‌ మూవీగా `భార‌త్` గురించి ప్ర‌చార‌మవుతోంది. ఇటీవ‌లే ఈ సినిమా నుంచి స‌ల్మాన్ భాయ్ - దిశా జంట‌గా న‌ర్తించిన స్లోమోష‌న్ సాంగ్ రిలీజైంది. 90ల‌లో మాధురి ధీక్షిత్.. ర‌వీనా టాండ‌న్ త‌ర‌హా క్లాసిక్ శారీ లుక్ తో దిశా అద‌ర‌గొట్టేసిందంటూ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక దిశా ఆ చీర‌క‌ట్టు.. పవిట కొంగుపైనా కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ ఇండస్ట్రీస్ లో బోలెడంత విశ్లేష‌ణ సాగింది. ప్ర‌స్తుతం భార‌త్‌ స్పెష‌ల్ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేష‌న‌ల్ హిట్స్ తో దూసుకుపోతోంది. భార‌త్  చిత్రానికి `టైగ‌ర్ జిందా హై` ఫేం అలీ అబ్బాస్ జాఫ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సునీల్ గ్రోవ‌ర్.. జాకీ ష్రాఫ్- నోరా ఫ‌తేహి- ట‌బు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్ని పోషిస్తున్నారు. స‌ల్మాన్ సెంటిమెంటు ప్ర‌కారం.. ఈద్ కానుక‌గా ఈ చిత్రం రిలీజ్ కానుంది. అనీస్ బ‌జ్మి.. మోహిత్ సూరి లాంటి ట్యాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తోనూ దిశా వ‌రుస‌గా సినిమాల‌కు క‌మిటైంది.
Tags:    

Similar News