ట్రిమ్‌ చెయ్‌.. గుణశేఖరునికి సలహా

Update: 2015-05-26 09:30 GMT
దర్శకుడు గుణశేఖర్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన స్టీరియోస్కోపిక్‌ 3డి హిస్టారికల్‌ సినిమా 'రుద్రమదేవి'. చిత్రీకరణ సహా అన్నిపనులు పూర్తయినా రిలీజ్‌ విషయంలో జాప్యమవుతూనే ఉంది. ఇప్పటికే ఆడియో రిలీజై చాలా కాలమే అయ్యింది. ఈ సినిమా ఎప్పుడొస్తుందా? 3డి ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంటుందా? అన్న ఆసక్తితో ప్రేక్షకాభిమానులు ఎదురుచూస్తున్నారు.

అయితే ఎంత ఎదురు చూసినా రిలీజ్‌ మాత్రం శూన్యం. ప్రస్తుతం బిజినెస్‌పై చర్చలు సాగిస్తున్నారు. సుదీర్ఘ నిడివితో ఉంది. కాస్త ట్రిమ్‌ చేయండి అంటూ పంపిణీదారులు గుణశేఖరునికి  సూచించారు. మరీ అంత లెంగ్త్‌ ఉంటే ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించినట్టు ఉంటుంది. కాబట్టి నిడివి తగ్గించాల్సిందేనని బయ్యర్లు పట్టుబడుతున్నారుట. గుణశేఖరుడు ప్రాణప్రదంగా ప్రేమించి ఈ సినిమాని తెరకెక్కించారు. కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. అయితే ఆ సెంటిమెంటును ఫైనాన్షియర్లు పట్టించుకోరు. పెట్టుబడిపై వడ్డీలు మాత్రమే లెక్కిస్తారు కాబట్టి .. ఇక గుణశేఖరునికి సైతం వేరే ఏ దారీ లేదనే అంటున్నారు.

బాహుబలి తరహాలో రెండు భాగాలు ప్లాన్‌ చేయలేదు కాబట్టి ఒకే సినిమాగా ట్రిమ్‌ చేసి చూపించాల్సిందే. ఏదేమైనా ఇప్పటికే లేటయ్యింది కాబట్టి కాస్త త్వరగా సినిమాను రిలీజ్‌కు తెచ్చేస్తే బెటర్‌. లేకపోతే జనాలు రుద్రమను మర్చిపోతారేమో.

Tags:    

Similar News