మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని ఎకనమిస్ట్ కార్ల్ మార్క్స్ ఎంతో అనుభవంతో అన్నాడు. మనిషి జీవితం ప్రస్తుతం డబ్బు చుట్టూ తిరుగుతోంది. అందువల్ల మినిమం విలువలు కోల్పోయే పరిస్థితి ఉందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. బంధుమిత్రులు.. స్నేహితుల మధ్య కూడా మనీ అనేది గొడవలు పుట్టిస్తోందన్నది నిర్వివాదాంశం.
ఇప్పుడు అలాంటి సన్నివేశమే ఆ క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య నెలకొందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆ వెంటనే అదే కాంపౌండ్ లో మరో భారీ చిత్రానికి సంతకం చేసిన సదరు ట్యాలెంటెడ్ డైరెక్టర్ ..మరోసారి నిరూపించుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం.. ఫస్ట్ క్లాస్ సినిమా తీసి సత్తా చాటాడన్న పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ సినిమా పారితోషికం విషయంలోనే నిర్మాత కం హీరోతో సెట్టవ్వలేదన్న గుసగుస వేడెక్కిస్తోంది. 8 కోట్ల పారితోషికం మాట్లాడుకుంటే అడ్వాన్సుగా ముట్టిన 2కోట్లు మాత్రమే తనకు దక్కింది. ఇంకా 6కోట్ల బ్యాలెన్స్ పారితోషికం విషయంలోనే లొల్లు నడుస్తోందట. సినిమా రిలీజై బాక్సాఫీస్ ఫలితం వచ్చేసింది. అయినా ఇంకా అదేదీ తేలడం లేదట. సదరు నిర్మాత కం హీరో స్నేహితుడే కదా అని అతడు ఎదురు చూస్తున్నాడు. అయితే ఎంతకీ తనకు ఆ బ్యాలెన్స్ పారితోషికం రాబట్టే పరిస్థితి లేకపోవడంతో అతడు ఈ విషయంలో మీడియాకి ఓపెన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడన్న ప్రచారం సాగుతోంది.
అయితే అటువైపు స్టార్ హీరో కం నిర్మాత అలా ఎగ్గొట్టే టైపు అయితే కాదు. ఎందులో అయినా కచ్ఛితంగా ఉంటారు. అలాంటిది తన స్నేహితుడైన ఆ దర్శకుడికి పెండింగ్ పారితోషికం ఎగ్గొట్టారా అంటే నమ్మలేని పరిస్థితి ఉంది. బహుశా భారీ చిత్రం తీసి బాక్సాఫీస్ వద్ద పెద్ద మొత్తం నష్టం రావడంతోనే అతడు కొంతకాలం వెయిటింగ్ చేయిస్తున్నాడని భావిస్తున్నారు. అయితే బయటకు పొక్కిన దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం? అన్నది క్లారిటీగా తెలియాల్సి ఉంటుంది. ఆ దర్శకుడి పారితోషికం విషయంలో మనస్ఫర్థలు పొడచూపాయన్న టాక్ అయితే బయట వినిపిస్తోంది. రేపో మాపో దీనిపై పంచాయితీ ఉంటుందా? అంటూ కొన్ని కథనాలు బయట గుసగుసగా వినిపించేస్తున్నాయ్.