భువి నుంచి దిగి వచ్చావా బిగ్ బాస్ బ్యూటీ..!

Update: 2023-01-20 05:38 GMT
భువి నుంచి దిగి వచ్చావా బిగ్ బాస్ బ్యూటీ.. నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ..! అదేంటీ ఆ పాట కాస్త తేడాగా ఉంది అనిపిస్తోందా... కాస్త తేడాగా ఉన్న మాట వాస్తవమే అయినా దివి వాద్త్యా ఫొటోలను చూస్తే ఇలాగే పాట పాడాలనిపిస్తుంది మరి. బిగ్ బాస్ తో పాపులారిటీని సంపాదించిన ఈ ముద్దుగుమ్మ రోజురోజుకూ తన అందాన్ని ద్విగుణీకృతం చేసుకుంటుంది. సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలు వదులుతూ... అందాల విందుతో తెగ రచ్చ చేస్తోంది.

హాట్ నెస్ లో తనను మించిన వాళ్లు లేరనేలా కుర్రకారును కవ్విస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ పొడుగు సుందరి... ఇన్ స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అలాగే ఈ అద్దాలు ఏంటో నన్ను నీలో దాచేసి, నీ నన్ను నాకు చూపిస్తున్నాయంటూ రాసుకొచ్చింది. అయితే ఈ ఫొటోల్లో బ్లాక్ డ్రెస్ వేసుకున్న దివి.. చందమామలా మెరిసిపోతుంది. నల్లటి చీకటిలో వెన్నెలలా కనిపిస్తూనే.. కైపెక్కిస్తుంది. తన నడుము అందాలను చూపిస్తూ యువకులను రెచ్చగొడ్తోంది. చేతులు పైకెత్తి మరీ తన ఒంపుసొంపులను.. వయ్యారంగా వడ్డిస్తోంది.

బ్లాక్ కలర్ లెహంగా వేసుకున్న దివి.. ఫుల్ హాట్ గ్లామర్ షో చేసింది. ఈ ఫొటోలతో నెట్టిల్లు మొత్తం షేక్ అవుతోంది అంటే అతిశయోక్తి కాదు. ఆ ఫొటోలను చూసిన కుర్రకారు లైకులు, కామెంట్లు, షేర్లతో రెచ్చిపోతున్నారు. ఫొటోలు పెట్టిన కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో లైకులు వచ్చాయి. చాలా మంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చాలా హాట్ గా ఉన్నావని కొందరు, నువ్వలా చూస్తే మాకు పిచ్చెక్కుతుందంటూ మరికొందరు చెబుతున్నారు.

నడుము, నాభిపై కామెంట్లు చేస్తూ... దివి ఫొటోలు చూడగానే తమకు కల్గిన అనుభూతిని కామెంట్లు రూపంలో అందరితో పంచుకుంటున్నారు. నీ అందాల విందుకు విలవిల్లాడిపోతున్నామంటూ వివరిస్తున్నారు. అన్నీ చూపిస్తూనే.. ఏం తెలియనట్లుగా అమాయకంగా చూస్తున్నావంటూ మరికొంత మంది కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత దివి.. పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. తాజాగా ఆమె ఏటీఎం వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అది జనవరి 20వ తేదీ అంటే ఈరోజే విడుదల కాబోతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News