‘కాంతారా’ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఎక్కడ చూసినా ఆ మూవీ గురించే చర్చ నడుస్తోంది. దేవుడి బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థిల్లర్ కథతో తెరకెక్కిన ఈ మూవీని చూసిన ఆడియన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిన దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టిని ప్రతి ఒక్కరూ ప్రశంసలతో ముంచెతుత్తున్నారు.
కన్నడ భాషలో తెరకెక్కిన ‘కాంతారా’ మూవీ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళంలో ఒకేసారి రిలీజ్ అయింది. కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా ‘కాంతారా’ రికార్డు నెలకొల్పింది. అదేవిధంగా తెలుగు, హిందీలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని భారీ వసూళ్ల దిశగా ముందుకెళుతోంది.
కాంతారా మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పించారు. ఆయన పెట్టిన దానికి పదింతలు డబ్బులు ఇప్పటికే వచ్చినట్లు తెలుస్తోంది. ఇక హిందీలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను రాబతోంది. హిందీలో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా కేవలం మౌత్ టాక్ తోనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు.
హిందీ వర్షన్లో ఈ సినిమా వీకెండ్లోనే కాకుండా మిగతా రోజుల్లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. మొదటి వారంలో ఈ మూవీ 15కోట్ల గ్రాస్ ను రాబట్టింది. కాగా ఈ గురువారం ఈ సినిమాకు రూ.1.9 కోట్ల నికరం వచ్చింది. గత శుక్రవారం 1.2 కోట్లు, ఆదివారం నాడు 3.5 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్ గా హిందీలో బాక్సాఫీస్ వద్ద రూ. 15కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
మరోవైపు దీపావళి వారంతం కూడా ‘కాంతారా’ మూవీకి కలిసి రానుంది. శని, ఆదివారాలు వసూళ్లు ప్రతీరోజు నాలుగు నుంచి కోట్ల ఏడు గ్రాస్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. హిందీలో ఈ మూవీకి గత వారం రోజులుగా మంచి టాక్ వస్తుండటం, దీపావళి సెలవులు సైతం కలిసి రానుండటంతో మరో 15 కోట్ల మేర కలెక్షన్లు వచ్చే అవకాశం కన్పిస్తోంది.
మొత్తంగా ఈ మూవీకి దాదాపు 25 కోట్ల మేర ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ మూవీ హిందీలో ‘కార్తీకేయ-2’ రికార్డును బ్రేక్ చేసేలా కన్పిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.