‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లాంటి మీడియం రేంజ్ సినిమాతో సత్తా చాటుకుని అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి భారీ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు హరీష్ శంకర్. ‘గబ్బర్ సింగ్’ తర్వాత అతడికిదే పెద్ద సినిమా. దీంతో తన రేంజ్ మారిపోతుందని అనుకున్నాడతను. కానీ ఈ సినిమా హరీష్ కెరీర్ కు గట్టి దెబ్బే వేసింది. ఓపెనింగ్స్ చూసుకుని దీన్ని బ్లాక్ బస్టర్ అదీ ఇదీ అన్నారు కానీ.. నిజానికి ఈ చిత్రం బయ్యర్లకు నష్టాలు మిగిల్చి ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా గురించి గొప్పలు చెప్పుకున్న దిల్ రాజు సైతం.. కొన్ని నెలల తర్వాత ఈ సినిమాకు నష్టాలొచ్చాయని.. మరో సినిమాతో బయ్యర్లకు నష్టాలు భర్తీ చేశానని చెప్పుకున్నాడు. హరీష్ మీద కూడా ‘డీజే’ తాలూకు నెగెటివ్ ఎఫెక్ట్ లేటుగా పడటం మొదలైంది.
‘డీజే’ విడుదలై ఏడాది దాటుతున్నా ఇప్పటిదాకా అతడి తర్వాతి సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కేలా కూడా కనిపించడం లేదు. రాజు బేనర్లోనే ‘దాగుడుమూతలు’ పేరుతో మల్టీస్టారర్ తీయాలని ఆశించిన హరీష్.. ఇటు నిర్మాతను కానీ.. అటు హీరోలను కూడా మెప్పించలేకపోయాడు. ఈ సినిమా కోసం అనుకున్న హీరోలు ముఖం చాటేశారు. దిల్ రాజు సైతం స్క్రిప్టు ఓకే చేయలేదు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘దాగుడుమూతలు’ దాదాపుగా ఉండదనే విషయాన్ని పరోక్షంగా చెప్పేశాడు రాజు. పోనీ రాజుతో కుదరకపోతే వేరే నిర్మాతను చూసుకుందామన్నా కష్టమే. జడ్జిమెంట్ కింగ్ గా పేరున్న రాజుకు నచ్చనపుడు మరో ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొస్తాడా అన్నది డౌటు. మొత్తానికి ఏడాది పాటు ఒక కథను పట్టుకుని వేలాడిన హరీష్ ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డాడు. మొత్తానికి ‘దువ్వాడ జగన్నాథం’కు ముందు హరీష్ పై ఉన్న గురి.. ఆ సినిమా తర్వాత పోయినట్లే తెలుస్తోంది. మరి ఈ స్థితిలో హరీష్ ఎలా పుంజుకుంటాడు.. ఏ సినిమా చేస్తాడు.. ఎవరితో చేస్తాడు అన్నది ఆసక్తికరం.