కాలం తో పాటుగా ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వస్తుంది. అది సహజమైన పరిణామం. అప్పట్లో సినిమా కు ఒక్క రిలీజ్ కాదు.. మూడు నాలుగు రిలీజులు ఉండేవి. మొదటి రిలీజ్ లోనే కాకుండా మలి రిలీజ్ లో కూడా ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి మరీ సినిమాను చూసేవారు.. ఆదరించేవారు. ఇప్పుడు సోషల్ మీడియా జెనరేషన్లో అంత ఓపిక తీరిక ఎవరికీ ఉండడం లేదు. సెకండ్ రిలీజ్ కాన్సెప్ట్ గతంగా మారింది. థియేట్రికల్ రన్ వారానికి.. జస్ట్ మూడు రోజుల కు పరిమితం అయింది. సినిమాల విషయంలో ప్రేక్షకులు సెలెక్టివ్ గా ఉంటున్నారని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. రొటీన్ సినిమాల కోసం.. సమయం.. డబ్బు వృథా చేసుకోకూడదు అనే ఆలోచనలో ఎక్కువమంది ఉన్నారని వారు అభిప్రాయపడుతున్నారు.
స్టార్ హీరోల సినిమాలు.. లేదా భారీ హైప్ వచ్చిన సినిమాలు తప్ప మిగతా వాటిని అధిక శాతం ప్రేక్షకులు ఏ మాత్రం పట్టించు కోవడం లేదని అంటున్నారు. ఈ ప్రభావం ముఖ్యం గా చిన్న హీరోలు.. మీడియం రేంజ్ హీరోల సినిమాల పై పడుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తే అది వీక్ డేస్ లో కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఓపెనింగ్స్ లేవనుకోండి.. సోమవారం నుండి ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈమధ్య రిలీజ్ అయిన రెండు మూడు సినిమాల విషయం తీసుకుంటే 'మీకు మాత్రమే చెప్తా'.. 'తిప్పరా మీసం' సినిమాలకు కొద్దో గొప్పో బజ్ ఉంది కానీ ఆ సినిమాలకు చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాలేదు. నిన్న రిలీజ్ అయిన సందీప్ కిషన్ సినిమా పరిస్థితి కూడా అంతంత మాత్రమే ట్రేడ్ వర్గాల వారు వ్యాఖ్యానిస్తున్నారు.
మరి ఈ పరిస్థితి ని అధిగమించడం ఎలా అంటే.. రొడ్డ కొట్టుడు కథలను కథనాలను చెత్తబుట్టలో పారేసి ఈ తరం ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ తో రావడం ఒకమార్గం. రెండవది.. స్ట్రాంగ్ ప్రమోషన్స్.. బలమైన మార్కెటింగ్. ఎంతమంచి సినిమా అయినా ప్రమోషన్స్ తో ప్రేక్షకులకు చేరువ చేయ లేకపోతే ఓపెనింగ్స్ రావడం అసాధ్యమే. మొదటి వారాంతం కలెక్షన్స్ కనుక సరిగా లేక పోతే ఇక ఫేక్ లెక్కలు చెప్పుకుంటూ హిట్ అంటూ టముకు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ అవసరం రాకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త పడాలని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.