మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. కొన్ని న్యూస్ ఛానెల్‌లు ఇదే యాక్సిడెంట్ ను నివేదించడంలో అధిక ఉత్సాహాన్ని చూపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదంపై కథలు కథలుగా కథనాలు అల్లి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్‌పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
సాయి ధరమ్ తేజ్ స్నేహితులు.. అభిమానులు మాత్రం తమ హీరో ఓవర్ స్పీడ్ గా వాహనాలు నడిపే వ్యక్తి కాదని రుజువు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ ను కొద్దిసేపటి క్రితం నటి మంచు లక్ష్మీ పరామర్శించారు. అనంతరం వరుస ట్వీట్‌లు చేశారు. సాయిధరమ్ పై దుష్ప్రచారం ఆపాలని విజ్ఞప్తి చేసింది. సాయితేజ్ బైక్ పై వేగంగా వెళ్లడం లేదని వీడియో చూస్తే తెలుస్తోందని మంచు లక్ష్మీ తెలిపింది..
"నాకు తెలిసిన అత్యంత బాధ్యతాయుతమైన పౌరులలో సాయి తేజ్ ఒకరు. అతను ఏ క్షణంలోనూ వేగంగా బైక్ పై వెళ్లలేదని చాలా స్పష్టంగా ఉంది. రోడ్డుపై బురద ఉండటం ప్రమాదానికి దారితీసింది. పుకార్లు వ్యాప్తి చేయడాన్ని నిలిపివేయాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. ప్రస్తుతం సాయితేజ్ బాగా స్పందిస్తున్నారు. ఇది సంయమనం పాటించాల్సిన సమయం. ఎందుకంటే ఇది అతనికి పునర్జన్మ లాంటిది. దయచేసి అతడు బాగుండాలని కోరుకోండి. త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. " ఆమె మంచు లక్ష్మీ ట్వీట్ చేసింది.

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రుల్లో కోలుకుంటున్నాడు. కన్నుపై భాగానికి. చాతిలో కొన్ని దెబ్బలు తగిలినట్టుగా వైద్యులు చెబుతున్నారు. సాయితేజ్ కు ఎలాంటి ప్రమాదం లేదని.. కోలుకుంటున్నాడని వైద్యులు బులిటెన్ లో తెలిపారు.