రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా భారీగా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ఉన్నత శిఖరాలకు చేర్చిన రాజమౌళి ఇప్పుడు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో 'ఆర్ ఆర్ ఆర్' అనే చిత్రంను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ అంతా సజావుగా సాగుతున్న సమయంలో మొదట రామ్ చరణ్ కు గాయం అయ్యింది. దాంతో ఉత్తర భారతదేశంలో చేయాలనుకున్న భారీ షెడ్యూల్ ను మద్యలోనే క్యాన్సిల్ చేశారు. చరణ్ గాయం నుండి కోలుకుంటున్న సమయంలోనే ఎన్టీఆర్ చేతికి గాయం అవ్వడంతో షూటింగ్ మరి కొన్ని రోజులు ఆలస్యం అయ్యింది.
ఇప్పటికే వచ్చిన గ్యాప్ చాలు, ఇక బ్రేక్ లేకుండా షూటింగ్ ను చేద్దామంటూ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు రాజమౌళి సూచించినట్లుగా సమాచారం అందుతోంది. హైదరాబాద్ లోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్టింగ్ లో ఈ చిత్రంకు సంబంధించిన తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. అతి త్వరలోనే హైదరాబాద్ షెడ్యూల్ కు ఆర్ ఆర్ ఆర్ టీం సిద్దం అవుతోంది. ఇదే సమయంలో ఎన్టీఆర్ కు జోడీ కోసం హీరోయిన్ ను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా హైదరాబాద్ షెడ్యూల్ లో పాల్గొనబోతుంది. కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యే సమయంకు మరో హీరోయిన్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ కోసం విదేశీ హీరోయిన్ ను ఎంపిక చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది జులైలో ఈ చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలంటే ఎలాంటి బ్రేక్ లేకుండా సినిమాను చకచక పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో జక్కన్న ఉన్నట్లుగా తెలుస్తోంది.