డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప’. ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. తూర్పుగోదావరి జిల్లాలోని మారేడు మిల్లి అడవుల్లో వందలాది మందితో షూటింగ్ నిర్వహించారు. ఇప్పటి వరకూ కేవలం 25% షూటింగ్ మాత్రమే పూర్తయింది.
తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో, ఆ తరువాత కేరళలో ప్లాన్ చేస్తున్నారు. అయితే.. సినిమా సగం కూడా పూర్తి కాకుండానే.. థియేట్రికల్ రిలీజ్ గురించి డిస్కషన్ జరగకుండానే.. OTT ప్లాట్ ఫాం గురించి చర్చ జరుగుతోంది. ఈ మూవీ ఏ OTTలో రిలీజ్ అవుతుందనే చర్చ జరుగుతోంది.
ఈ చిత్రం డిజిటల్ హక్కులు దక్కించుకునేందుకు ప్రముఖ OTT సంస్థలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ ఈ రేసులో ఉన్నాయని సమాచారం. ఇందుకోసం భారీ అమౌంట్ ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. అల్లు అర్జున్ సొంత OTT.. ‘ఆహా’ ఉన్న సంగతి తెలిసిందే.
మరి, ఆయన హీరోగా నటిస్తున్న మూవీని.. వేరే ఓటీటీకి వెళ్లనిస్తారా? అన్నదే ఆసక్తికరంగా మారింది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలోకి ‘ఆహా’ కొత్తగా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇది పాపులారిటీ సాధించాలంటే.. సొంత కంటెంట్ తోపాటు ప్రతిష్టాత్మక చిత్రాలు మరిన్ని ఇందులో స్ట్రీమ్ అయితే బాగుంటుందని భావిస్తోంది యాజమాన్యం.
ఇప్పటికే మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ హిట్ ‘క్రాక్’ స్ట్రీమింగ్ హక్కులను ‘ఆహా’ సొంతం చేసుకుంది. ఇక, ‘పుష్ప’ కూడా వారి ఖాతాలో పడితే మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. మరి, ఏం జరుగుతుంది? ‘పుష్ప’ ఎందులో రిలీజ్ అవుతుంది అన్నది చూడాలి.