'ఆచార్య' అస‌లు బ‌డ్జెట్ ఎంతో తెలుసా?

Update: 2022-04-27 10:30 GMT
'సైరా నరసింహారెడ్డి' వంటి దేశ‌భ‌క్తి చిత్రం త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమానే 'ఆచార్య‌'. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్‌ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 'సిద్ధ‌' అనే కీల‌క పాత్ర‌ను పోషించారు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించ‌గా.. మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

గ‌త ఏడాది మే నెల‌లోనే విడుద‌ల కావాల్సి ఉన్న ఈ చిత్రం.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు అన్నీ చ‌క్క‌బ‌డ‌టంతో మేక‌ర్స్ ఆచార్య‌ను ఏప్రిల్ 29న భారీ అంచ‌నాల న‌డుమ‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్ప‌టికే సెన్స‌ర్ ప‌నులు కూడా పూర్తి అవ్వ‌గా.. ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆచార్య బ‌డ్జెట్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. దాని ప్ర‌కారం.. ఈ సినిమా అస‌లు బ‌డ్జెట్ రూ. 102 కోట్ల రేంజ్‌లో అయింద‌ట‌. హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కుడు మ‌రియు మిగిలిన న‌టీ న‌టుల రెమ్యున‌రేష‌న్స్ తో క‌లిపి మొత్తంగా రూ. 180 కోట్ల వ‌ర‌కు బ‌డ్జెట్ అయింద‌ని టాక్ న‌డుస్తోంది.

ఇక బడ్జెట్ డీటెయిల్స్ వంద కోట్లకు పైగా ఉండటంతో స్పెషల్ కేస్ కింద ఈ సినిమాకి ఏపీలో రూ. 50 టికెట్ హైక్స్ ను  క‌ల్పించారు.

మ‌రోవైపు తెలంగాణ‌లోనూ ఆచార్య‌కు టికెట్‌ ధరలు పెంచుకునేలా ప్రభుత్వం వెసులు బాటు కల్పించింది. మల్టీప్లెక్స్‌ల్లో రూ.50, సాధారణ థియేటర్లలో రూ. 30 పెంచుకునేందుకు అనుమ‌తులు జారీ చేసింది. కాగా, ధర్మస్థలి అనే ఓ గ్రామం నేపథ్యంలో ఆచార్య క‌థ న‌డుస్తోంది.

ఈ చిత్రంలో చిరంజీవి, చ‌ర‌ణ్ లు నక్సలైట్స్ గా క‌నిపించ‌బోతున్నారు. అలాగే ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డేల‌ను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. కానీ, కాజ‌ల్ పాత్ర‌కు ప్రాధాన్య‌త లేక‌పోవ‌డం, స‌రైన ముగింపు ఉండ‌క‌పోవ‌డంతో కొర‌టాల ఆమెను సినిమా నుంచి తొల‌గించారు.
Tags:    

Similar News