ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు జెఫ్ బెజోస్. ఈ అమెజాన్ అధినేత వయసు అయిపోవడంతో సీఈవో బాధ్యతల నుంచి ఇటీవలే తప్పుకున్నారు. అమెజాన్ ను ఇంత ఎత్తుకు తీసుకొచ్చిన బెజోస్ ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీగా నిలపడంలో ఎంతో కృషి చేశారు. ఇప్పుడు ఆయన దిగిపోవడంతో బెజోస్ వారసుడిగా.. అమెజాన్ నూతన సీఈవోగా ఆండీ జస్సీని నియమించారు.
అమెజాన్ నూతన సీఈవోగా ఆండీ జస్సీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన జీతం కళ్లు చెదిరేలా ఉన్న విషయం బయటపడింది. ఆండీ జాస్సీ అమెజాన్ సీఈవోగా స్టాక్ గ్రాంట్లు, వేతన వివరాలను తాజాగా అమెజాన్ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది.
ఇప్పటివరకు సీఈవోగా జెఫ్ బెజోస్ సెంటిమెంట్ ప్రకారం జూలై 5న సీఈవో పదవి నుంచి నేడు తప్పుకున్నారు. దీంతో బెజోస్ స్థానంలో జాస్సీ బాధ్యతలను ఈరోజు స్వీకరించారు.
అమెజాన్ కు చెందిన 61వేల షేర్లను ఆండీ జస్సీకి సీఈవో అయినందుకు మంజూరు చేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. దీనివిలువ 214 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో రూ.1600 కోట్లు. పదేళ్ల కాలానికి ఈ షేర్లను అతడికి కేటాయించారు.ఇప్పటికే జాస్సీకి 300 మిలియన్ల డాలర్ల విలువైన షేర్లు ఉన్నాయి. అమెజాన్ షేర్ ఆధారంగా ఈ విలువ ఆధారపడి ఉంటుంది. అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ చీఫ్ గా ఆయన అందుకుంటున్న అవార్డుల కంటే ఇది చాలా పెద్దది.
ఆండీ జస్సీ బేసిక్ వేతనం 1,75,000 డాలర్లు. సుమారు కోటి 30 లక్షల రూపాయలు ఉండనుంది. ఇప్పటికే 45.3 మిలియన్ల షేర్లు అతడి ఖాతాలో ఉన్నాయి. 2020 నాటిని ఆయన పెట్టుబడుల విలువ 41.5 మిలియన్ డాలర్లు.అయితే ఇతర టెక్నాలజీ కంపెనీలో పోలిస్తే అమెజాన్ సీఈవో స్టాక్ గ్రాంట్ తక్కువ అని.. మైక్రోసాఫ్ట్, గూగుల్, సీఈవోల కంటే ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అమెజాన్ సీఈఓ వేతనం తక్కువేనని అంటున్నారు.