థియేటర్లో పట్టించుకోని సినిమాని టీవీల్లో చూస్తారా..?

Update: 2022-02-04 00:30 GMT
దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ డ్రామా ''1945'' సంక్రాంతికి ముందు జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆరేళ్ళ క్రితమే నిర్మాణం మొదలుపెట్టిన ఈ సినిమా.. మేకర్స్ తో రానా కు విభేదాలు రావడం.. మధ్యలో కరోనా పాండమిక్ రావడంతో ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు నిర్మాతలు హడావుడిగా పనులు పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేశారు.

మీడియా సోషల్ మీడియాలలో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా జీరో బజ్ తో విడుదలైన '1945' డిజాస్టర్ అయింది. రానా ఈ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పలేదంటేనే ఎలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ రిలీజ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా దేశభక్తి సినిమాలు చూడటానికి సినీ అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఈ సినిమా వచ్చినట్లు కూడా తెలియకపోవడం.. తెలిసిన వాళ్ళు కూడా ప్లాప్ అని తేల్చేయడంతో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం మూటగట్టుకుంది.

అయితే ఇప్పుడు ''1945'' సినిమా బుల్లితెర పై ప్రీమియర్ షోకు సిద్ధమవుతోంది. జెమినీ టీవీలో ఫిబ్రవరి 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ చిత్రం ప్రసారం కాబోతోంది. అంటే సరిగ్గా విడుదలైన నెల రోజులకే ఈ మూవీ టెలివిజన్ స్క్రీన్ మీదకు రాబోతోంది. థియేటర్లలో ఎవరూ పట్టించుకోని ఈ చిత్రాన్ని.. ఇప్పుడు టీవీలలో చూసేందుకు ఎవరైనా ఆసక్తి చూపిస్తారో లేదో చూడాలి.

కాగా, '1945' చిత్రానికి సత్యశివ దర్శకత్వం వహించారు. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మించారు. ఇందులో రానా సరసన రెజీనా కసాండ్రా హీరోయిన్ గా నటించగా.. సత్యరాజ్ - నాజర్ - సప్తగిరి - కాళీ వెంక‌ట్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. స‌త్య పొన్మార్ సినిమాటోగ్రఫీ అందించగా.. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం సమకూర్చారు.
Tags:    

Similar News