గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. బాయ్ కాట్ వివాదం కూడా బాలీవుడ్ ని ఓ కుదుపు కుదిపేస్తోంది. అయితే రణ్ బీర్ కపూర్ నటించిన `బ్రహ్మాస్త్ర`కు మాత్రం ఆ వాతావరణం కనిపించడం లేదు. బాయ్ కాట్ ట్రెండ్ కూడా వినిపించడం లేదు. బాలీవుడ్ అంతటా ఈ మూవీపై పాజిటివ్ ట్రెండ్ నడుస్తోంది. దానికి నిదర్శనమే అడ్వాన్స్ బుకింగ్స్. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రికార్డు సృష్టించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
పీవీఆర్, ఐనాక్స్, సినీ ప్లెక్స్ వంటి మల్టీప్లెక్స్ లలో ఇప్పటికే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇదిలా వుంటే యావత్ బాలీవుడ్ మొత్తం ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తోంది. ఎక్కడ నెగటివిటీ రాకుండా.. అలాంటి వాటిని చోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. యావరేట్ టాక్ వచ్చినా ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భీభత్సం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కారణం బాలీవుడ్ లోని ప్రతీ ఒక్కరూ ఈ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నారు.
`బ్రహ్మాస్త్ర`ని హిట్ చేయడం కోసం బాలీవుడ్ మొత్తం ఏకమైనట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాని ఓ ఎమోషన్ గా తీసుకుంటున్నారట. ఈ మూవీతో బాలీవుడ్ సినిమాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని, గత వైభవాన్ని కోల్పోయిన బాలీవుడ్ సినిమాని కాపాడు కోవాలి అనే పట్టుదలతో సెంటిమెంట్ ని రైజ్ చేస్తూ బాలీవుడ్ వర్గాలు, ప్రేక్షకులు, క్రిటిక్స్, మీడియా అంతా ఏకమైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో `బ్రహ్మాస్త్ర`కు బాక్సాఫీస్ వద్ద తొలి రోజు యావరేజ్ అన్న టాక్ వచ్చినా వసూళ్ల సునామీని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
కంటెంట్ బలంగా వుండి సినిమా హిట్ అంటే పేరుకు తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాస్త్రంలా దూసుకుపోవడం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ మూవీకి భారీ స్థాయి ఓపెనింగ్స్ కూడా రావడం లాంఛనమే అని తెలుస్తోంది. ఒక్క హిందీలోనే ఈ మూవీ ఫస్ట్ డే రూ. 30 కోట్లు వసూలు చేసే అవకాశం వుందని, వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 50 కోట్లకు పైగానే రాబట్టే అవకాశం వుందని ట్రేడ్ పండితులు జోస్యం చెబుతున్నారు.
మరి సెప్టెంబర్ 9న `బ్రహ్మాస్త్ర` విషయంలో అదే జరగబోతోందా?.. బ్లాక్‌బస్టర్ హిట్ ని అందించి బాలీవుడ్ కు కొత్త ఆశల్ని చిగురింపజేస్తుందా? అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు ఎదురుచూడాల్సిందే. ఈ మూవీలో అలియాభట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్, కీలక అతిథి పాత్రల్లో దీపికా పదుకోన్, షారుఖ్ ఖాన్ నటించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.