లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వరల్డ్ బాక్సింగ్ చరిత్రలోనే ఎన్నో సంచలనాలు సృష్టించిన మైక్.. కెరీర్ ఆసాంతం వివాదాలతో సావాసం చేశారు. ఆవేశపరుడిగా ముక్కోపిగా అందరికీ గుర్తిండి పోయాడు. 1997లో తోటి బాక్సర్ హోలీఫీల్డ్ చెవి కొరికి బాక్సింగ్ నుంచి సస్పెండ్ చేయబడిన సంఘటనను ఎవరూ మర్చిపోలేరు.
బాక్సింగ్ ఆట నుంచి తప్పుకున్నాక కూడా మైక్ టైసన్ తరచుగా ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అలాంటి ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ ను ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు పూరీ జగన్నాథ్ మరియు నిర్మాత కరణ్ జోహార్. 'లైగర్' సినిమాలో కీలక పాత్ర చేయడానికి ఒప్పించారు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరీ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా స్పోర్ట్ యాక్షన్ ఫిల్మ్ "లైగర్". ఇందులో వీడీ ఎంఎంఏ ఫైటర్ గా నటించగా.. టైసన్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని మేకర్స్ ప్రకటించారు. తెలుగు సినిమాలో బాక్సింగ్ లెజెండ్ భాగమవుతున్నారని అందరూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు.
దీనికి తగ్గట్టుగానే 'లైగర్' పబ్లిసిటీ కోసం మైక్ పేరుని గట్టిగానే వాడుకున్నారు మేకర్స్. సినిమా పోస్టర్లలో విజయ్ - టైసన్ సగం సగం ఫేసులను చూసి ఎంతో ఊహించుకున్నారు. 'లైగర్' ట్రైలర్లో 'ఇఫ్ యూ ఆర్ ఏ ఫైటర్.. దెన్ హు యామ్ ఐ' అంటూ టైసన్ చెప్పిన డైలాగ్ ఆసక్తి రేకెత్తించింది.
ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందం ఎక్కడికి వెళ్లినా మైక్ టైసన్ పాత్ర గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. టైసన్ తో VD నటిస్తున్నానని తెలిసి అతని తల్లి బాగా భయపడిందనని తెలిపారు. ఎప్పటికప్పుడు షూటింగ్ లొకేషన్స్ లో పిక్స్ - వీడియోలు రిలీజ్ చేస్తూ కావాల్సినంత బజ్ తీసుకొచ్చారు.
ఓ విధంగా 'లైగర్' సినిమా మీద అంచనాలు పెరగడానికి మైక్ టైసన్ కూడా ఒక కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం ఒక భారతీయ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే ఎంతో కొంత విషయం ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే తీరా తెర మీద టైసన్ ను చూపించిన విధానానికి షాక్ అవుతున్నారు.
'లైగర్' మూవీ భారీ అంచనాల నడుమ గురువారం పాన్ ఇండియా స్టాయిలో విడుదలైంది. మొదటి ఆట తోనే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి నుంచీ చిత్ర బృందం గొప్పగా చెబుతూ వచ్చిన టైసన్ పాత్ర స్క్రీన్ మీద తేలిపోయింది.
కథలో మైక్ కీలకంగా ఉంటాడని.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం కాబట్టి విజయ్ దేవరకొండ ను ఇన్‌స్పైర్ చేసే పాత్రలో టైసన్ కనిపిస్తాడని అంతా భావించారు. అయితే సినిమాలో అతని పాత్రను అటు కామెడీకి ఇటు విలన్ కి కొరగాని రోల్ లో చూపించారు.
హీరోయిన్ ని కిడ్నాప్ చేసి తనకు రావాల్సిన డబ్బులు డిమాండ్ చేసే ఒక సిల్లీ క్యారెక్టర్ లో మైక్ కనిపించాడు. హీరో వెళ్లి అతడితో తలపడి కామెడీగా పడగొట్టి తన ప్రేయసిని తీసుక్కచ్చుకుంటాడు. ఈ ఎపిసోడ్ ను క్లైమాక్స్ లో ప్రెజెంట్ చేయగా.. అది ఏమాత్రం ఆకట్టుకోపోగా, సినిమాలో ఒక మైనస్ గా మిగిలింది.
అసలు లెజండరీ బాక్సర్ ను పూరీ జగన్నాథ్ ఇలాంటి కామెడీగా వాడుకున్నాడేంటి అని ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఈ మాత్రం దానికి ఆయన అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇలాంటి జోకర్ పాత్రకు మైక్ టైసన్ ఎలా ఒప్పుకున్నాడు.. పూరీ ఏం చెప్పి ఒప్పించాడు అని అందరూ జుట్టు పీక్కుంటున్నారు. మైక్ కు వేరేలా నెరేట్ చేసి పూరీ మోసం చేసి ఉంటారని నెటిజన్లు ఫన్నీ మీమ్స్ తో నెట్టింట సందడి చేస్తున్నారు.