జిమ్మింగ్ క్వీన్ ర‌కుల్ కు బేసిక్స్ కూడా తెలీదా?

Update: 2021-07-06 04:45 GMT
జిమ్ లో క‌స‌ర‌త్తులు చేయ‌డం అంటే అంత ఆషామాషీ ఏం కాదు. జిమ్ అల‌వాటు ప‌డ‌డానికి నెల‌ల కొద్దీ స‌మ‌యం ప‌డుతుంది. అలాగే బేసిక్స్ తెలుసుకోవ‌డానికే ఏళ్ల త‌ర‌బ‌డి టైమ్ తీసుకుంటుంది. ఎంత తెలిసినా ఇంకా త‌ప్పులు చేసేవాళ్లుంటారు. అయితే జిమ్ లో చేసేవాళ్లు త‌ప్పు చేసినా శిక్ష‌కుడు లేదా కోచ్ త‌ప్పు చేయ‌కూడ‌దు. త‌ప్పు చేయ‌నీయకూడ‌దు. అలాగే జిమ్ నిర్వాహ‌కులు సైతం బేసిక్స్ పై అవ‌గాహ‌న‌ను క‌లిగి ఉండాలి.

ఇక ఇటీవ‌లి కాలంలో జిమ్ యోగా సెష‌న్స్ తో నిరంత‌రం అంత‌ర్జాలాన్ని హీటెక్కిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎఫ్ 45 పేరుతో హైద‌రాబాద్ వైజాగ్ లాంటి చోట్ల జిమ్ ల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఈ జిమ్ ల‌కు తానే బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కొన‌సాగుతున్నారు. నిరంత‌రం త‌న జిమ్ ల‌ను ర‌కుల్ ప్ర‌మోట్ చేసుకుంటూనే ఉన్నారు.

అయితే ఇన్ని చేస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ కి మినిమం బేసిక్స్ కూడా తెలియ‌వా? అంటే అస‌లు త‌న‌కేమి తెలుసు? అంటూ ఒక జిమ్ కోచ్ కామెంట్ చేసిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. ఇటీవ‌ల ర‌కుల్ల డెడ్ లిఫ్ట్ కోసం ప్రయత్నిస్తున్న వీడియో విమర్శలకు గురైంది. డెడ్ లిఫ్ట్ ను రకుల్ ఎలా త‌ప్పుగా చేస్తోందో జిమ్ ట్రైనర్ విశ్లేషించారు. అతను రకుల్ భంగిమను.. త‌ను ధరించిన బూట్లలో కూడా తప్పు కనుగొన్నాడు. ఆమెను చూస్తున్న ఇద్దరు శిక్షకులు ఎలా ఫెయిల‌య్యారో కూడా విశ్లేషించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బేసిక్స్ తప్పు అని చూసిన వారంతా ఎగతాళి చేస్తున్నారు. జిమ్ ల నిర్వాహ‌కురాలిగా ఇంకా బేసిక్స్ నేర్చుకోలేదా? అంటూ త‌ప్పు ప‌డుతున్నారు. స‌రైన అర్హతగల శిక్షకులను పొందలేకపోయిందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. బిల్డప్ క్వీన్  రకుల్ కు బేసిక్స్ కూడా తెలీదా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

అయితే విమ‌ర్శించేవాళ్లు అర్థం చేసుకోవాల్సిన‌ది ఏమిటి? అంటే.. ఏళ్ల త‌ర‌బ‌డి జిమ్ చేస్తున్నా కోచ్ చెప్పినంత ప‌ర్ఫెక్ష‌న్ తో జిమ్ చేసేవాళ్లు చాలా అరుదు. కేవ‌లం అద్దం ముందు సోకులు చూసుకునేందుకు టైమ్ పాస్ చేసేవాళ్లే జిమ్ లో ఎక్కువ మంది క‌నిపిస్తుంటారు. జిమ్ అనేది ఎంతో నిబద్ధ‌త‌తో చేసే హార్డ్ వ‌ర్క్. అదేమీ చాక్లెట్ తిన్నంత వీజీ కాదు!! ర‌కుల్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే క్రిష్ తో కొండ‌పొలం రిలీజ్ కి రావాల్సి ఉంది. భార‌తీయుడు 2 స‌హా ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.
Tags:    

Similar News