ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి ఆతరువాత దాదాపు పదేళ్లు సినిమాలకు, ఇండస్ట్రీకి దూరంగా వుంటూ వచ్చారు. ఆ తరువాత రాజకీయాల కంటే సినిమాలే తనకు ఇష్టమని భావించి మళ్లీ పదేళ్ల విరామం తరువాత సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ఇందు కోసం తమిళ బ్లాక్ బస్టర్ హిట్ ఫిల్మ్ 'కత్తి'ని ఎంచుకుని తెలుగులో 'ఖైదీ నంబర్ 150'గా రీమేక్ చేశారు. చిరు రీఎంట్రీ ఫిల్మ్ గా విడుదలైన ఈ మూవీకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు.
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పదేళ్లైనా చిరు గ్రేస్, ఫామ్ తగ్గలేదని, ఫ్యాన్స్ లో ఆ క్రేజ్ అలాగే వుందని ఈ మూవీ మరోసారి నిరూపించి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. పదేళ్ల తరువాత సోలోగా బ్లాక్‌బస్టర్ ని సొంతం చేసుకున్న మెగాస్టార్ ఆ తరువాత నుంచి తన సినిమాల్లో ఇతర స్టార్ లని ఎంకరేజ్ చేయడం, ఇతర స్టార్లకు ప్రాముఖ్యత నివ్వడం మొదలు పెట్టారు. తన సినిమాల్లో ఇతర స్టార్లకు చోటివ్వడం మొదలు పెట్టారు.
'సైరా నరసింహా రెడ్డి'లో అమితాబ్ బచ్చన్ గురువు పాత్రలో నటించగా.. ఇతర కీలక పాత్రల్లో తమిళ హీరో విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించారు. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా వైడ్ గా విడుదలైన ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేక తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక ఈ మూవీ తరువాత రెండుళ్ల తరువాత 'ఆచార్య' మూవీతో చిరు ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక అతిథి పాత్రలో నటించాడు.
తండ్రీ కొడుకులిద్దరు కలిసి నటించిన తొలి సినిమా కావడంతో ఫ్యాన్స్ తో పాటు అందరిలోనూ ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. కొరటాల శివ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్ అనిపించుకుని షాకిచ్చింది.
త్వరలో రిలీజ్ కానున్న 'గాడ్ ఫాదర్' మూవీలో సల్మాన్ ఖాన్, 'వాల్తేరు వీరయ్య'లో రవితేజ కీలక అతిథి పాత్రల్లో నటించారు. ఎన్నడూ లేని విధంగా మెగాస్టార్ ఇలాంటి సినిమాలే ఎందుకు చేస్తున్నారు?.. ఆ అవసరం ఆయనకే ఎందుకొస్తోంది? అనే కామెంట్ లు మొదలయ్యాయి.
సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో 'గాడ్ ఫాదర్'లో నటించాడు. అయినా ఈ మూవీకి పెద్దగా బజ్ లేదు.. చిరు లాగే సీనియర్ స్టార్ అయిన బాలకృష్ణ ఇప్పటికీ సోలోగా సై అంటుంటే చిరు మాత్రం ఇలా ఇతర హీరోలతో కలిసి సినిమాలు ఎందుకు చేస్తున్నారని, వారి సపోర్ట్ ని ఎందుకు కోరుకుంటున్నారు?.. మెగాస్టార్ కు మరో స్టార్ అవసరమా? అని ఫ్యాన్స్ వాపోతున్నారట. ప్రస్తుతం ఫ్యాన్స్ లో నెట్టింట ఇదే ప్రధాన చర్చగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.