సంపూ కామెడీ బోర్‌ కొట్టేసిందా?

Update: 2021-08-23 02:30 GMT
తెలుగు ప్రేక్షకులకు సంపూర్నేష్‌ బాబు అనే పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు హీరోలు అంటే ఒడ్డు పొడవు రంగు అన్ని విధాలుగా ఒక పర్ఫెక్ట్‌ రూపం ఉన్న వారు మాత్రమే అనుకుంటూ ఉన్న సమయంలో సంపూర్నేష్‌ బాబు రంగంలోకి దిగాడు. హృదయ కాలేయం' సినిమా తో హీరోను అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంపూర్నేష్‌ బాబును రాజమౌళి వంటి సెలబ్రెటీలు ప్రమోట్‌ చేయడంతో జనాల్లోకి బాగా దూసుకు పోయాడు. సంపూర్నేష్‌ బాబు కమెడియన్ గా వస్తున్న ఆఫర్లు ఎక్కువగా చేయకుండా కేవలం హీరోగానే సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో హీరోగా పలు సినిమాలు ఉన్నాయి.

ఇటీవల బజార్ రౌడీ సినిమాతో సంపూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీ ప్రధానంగా సంపూ సినిమాలు ఉంటాయని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. ఈ సమయంలో భారీ చిత్రాలను చూసేందుకు కూడా జనాలు వస్తారా లేదా అనే అనుమానం ఉంది. కరోనా భయం జనాల నుండి ఇంకా పూర్తిగా పోలేదు. అందువల్ల చాలా సినిమాలు విడుదలకు ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో బజార్ రౌడీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ల ద్వారా విడుదల అయిన బజార్‌ రౌడీని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. సంపూ సినిమానే కదా అని లైట్ తీసుకున్నారు.

సంపూ కామెడీ బోర్ కొట్టి జనాలు ఈ సినిమాను దూరం పెట్టారా అంటే అలాంటిది ఏమీ లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంపూ కామెడీ మూవీ అంటే మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఉంటుంది. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో మినిమం గ్యారెంటీ సినిమాలను జనాలు చూసేందుకు థియేటర్లకు వెళ్లేంత సాహసం చేయడం లేదు. పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిన కమర్షియల్‌ సినిమాలను కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సంపూ బజార్ రౌడీ సినిమా కు జనాలు రానంత మాత్రాన ఆయన కామెడీ బోర్‌ కొట్టినట్లుగా భావించనక్కర్లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా సంపూ సినిమా లు మళ్లీ ఒక మోస్తరుగా మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఆడటం ఖాయం అని.. ఇప్పట్లో సంపూ కామెడీ బోర్‌ కొట్టదని ఆయన్ను చూస్తేనే జనాలు ప్రత్యేకంగా ఫీల్‌ అవుతారు. కనుక సంపూ సినిమా సరైన సమయంలో వస్తే మినిమం వసూళ్లు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.
Tags:    

Similar News