ఎత్తైన పొట్ట‌ని అలా క‌వ‌ర‌ప్ చేస్తున్నాడా?

Update: 2022-11-25 02:30 GMT
ఇటీవ‌లే ఓ ప‌ర‌భాషా న‌టుడు పాన్ ఇండియాలో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. కెరీర్ ఆరంభంలోనే అలాంటి స‌క్సెస్  అత‌ని సైతం  ఊహించ‌న‌ది. మిర‌కిల్స్  ఎలా జ‌రుగుతాయ‌న్న‌ది  తొలిసారి అత‌నికి అర్ధ‌మైన సంద‌ర్భం అంది. ఒక్క హిట్ తో అత‌ని పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది.  అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. బాలీవుడ్..కోలీవుడ్..టాలీవుడ్ ఇలా అన్ని  ప‌రిశ్ర‌మ‌లు మా  భాష‌లో సినిమా చేయండి అంటూ అడుగుతున్నాయి.

కానీ అత‌ను మాత్రం సొంత ప‌రిశ్ర‌మ‌ని దాటి బ‌య‌ట‌కు రాను అంటున్నాడు. ఈ క్ర‌మంలో అత‌న్ని క‌ల‌వాల‌ని ఎంతో మంది స్టార్లు సైతం ఆస‌క్తి చూపిస్తున్నారు. సూప‌ర స్టార్ ర‌జ‌నీకాంత్ స‌హా చాలామంది అత‌న్ని ఇంటికి పిలిపించుకుని స‌న్మానిస్తున్నారు. మ‌ధ్యాహ్నం లంచ్ కి రావాలి...నైట్ డిన్న‌ర్ పార్టీకి రావాలి....స్పెష‌ల్ పార్టీలంటూ త‌రుచూ  చాలా ఆహ్వానాలే అందుతున్నాయి.


దీంతో ఆయ‌న  ఎవ‌రి మాట కాద‌న‌లేక వీలైనంత వ‌ర‌కూ హాజ‌ర‌వుతున్నాడు. త‌రుచూ ప్లైట్ జ‌ర్నీలు చేస్తూ క‌నిపిస్తున్నాడు. అయితే ఈ హీరో గురించి  ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒక‌టిప్పుడు వైర‌ల్ అవుతుంది. సినిమాలో న‌టించిన ఆ హీరో ఎక్క‌డైనా స‌రే కేవ‌లం టీష‌ర్స్ట్ తోనే క‌నిపిస్తున్నాడు. వాటిల్లో చూడ‌టానికి  సింపుల్ గా స్టైల్ గాను క‌నిపిస్తున్నాడు.

కానీ ఫుల్ హ్యాండ్స్ టీష‌ర్ట్ వెనుక మ‌రోక‌థ కూడా  ఉంద‌ని గుస‌గుస వినిపిస్తుంది. కాస్త ఎత్తుగా ఉన్న త‌న పొట్ట ముందు బాగాన్ని క‌వ‌ర‌ప్ చేసుకోవ‌డం కోస‌మే ఆ ర‌క‌మైన టీష‌ర్ట్ లు  ధ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. ఛాతి ముందుగా భాగంలో రెండు పొడ‌వైన తాళ్లు... పొట్ట భాగం వ‌ద్ద రెండు ముందుకుపొడుచుకు వ‌చ్చిన‌ట్లు పాకెట్స్ స‌హా..అందులో హీరోగారి చేతులు స‌రిగ్గా గ‌మ‌నిస్తే స్ట‌మ‌క్ ని క‌వ‌రప్ చేస్తున్న‌ట్లు  నెటి జ‌నులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

అయితే హీరోగారు మాత్రం స్లిమ్ లుక్ లో కి మారే ప్ర‌యత్నాలు సీరియ‌స్ గానే చేస్తున్న‌ట్లు స‌మాచారం. జిమ్ ...యోగా..డైట్ అంటూ ఆరోగ్య జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారుట‌. సినిమాలో కూడా ష‌ర్ట్ ..బ‌నియ‌న్ లేకుండా కొన్ని స‌న్నివేశాల్లో క‌నిపించాడు. అందులో  పొట్ట భాగం హైలైట్ అయింద‌ని ఓ నెటి జ‌నుడు దాని తాలూకా ఫోటో పోస్ట్ చేసాడు.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News