చాలా కాలం క్రితం ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ టీమిండియా క్రికెటర్ కె.ఎల్.రాహుల్ తో డేటింగులో ఉందంటూ ప్రచారమైంది. కెరీర్ ఆరంభమే అక్కినేని హీరోల సరసన నటించిన ఈ భామ ఇటీవల వేరొక ప్రముఖునితో డేటింగులో ఉందంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఇవన్నీ నిజమా? అని నిధిని ప్రశ్నిస్తే చాలా సంగతులే తెలిశాయి.
నా డేటింగ్ పై అనవసర ఊహాగానాలు వద్దు. అవన్నీ పుకార్లేనని కొట్టి పారేసింది నిధి. తాను స్నేహితులతో బయటికి బయలుదేరినా చాలా జాగ్రత్త పడుతున్నానని తెలిపింది. గతానుభవాలతో నేను ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉన్నాను. నేను ఒక స్నేహితుడితో కలిసి విందుకు వెళ్లాలనుకున్నా జాగ్రత్తగా ఉంటున్నా. ఈ లింకప్ లు నాకు అక్కరలేదు. అందుకే అలా ఉన్నాను`` అని నిధి తెలిపారు. నేను నాన్ స్టాప్ గా ప్రయాణిస్తున్నాను. పూర్తిగా ఒంటరిగా ఉన్నాను. నాకు మెసేజ్ లు ఇవ్వడానికి ఎవరూ లేరు.. పిలవటానికి ఎవ్వరూ లేరు.. ఆశ్చర్యంగా ఉంది నేను ఎవరికి టెక్స్ట్ చేస్తాను. అప్పుడప్పుడు నేను నా మేనేజర్ కు సందేశం పంపడం తప్ప! అని అంది.
``కనీసం జీవితంలో ఎవరికైనా చోటుందా? అని నిలదీస్తే ..మొదట నేను ఒకరిని కలవాలి. ఆ తర్వాత ఏదైనా జరగొచ్చు! అని అంది. కానీ ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరైనా నా జీవితంలోకి వస్తే నేను సంతోషంగా ఉంటాను. అలాగని దానికోసమే వేచి ఉండను`` అని అంది. ఎవరో వచ్చి నా జీవితానికి సానుకూలతను జోడించవచ్చు. లేకపోయినా నేను సంతోషంగానే ఉన్నాను. అది అవసరం లేదు. చాలా ప్రయాణాలు తక్కువ నిద్రతో నేను వేరే ఏమీ చేయలేను`` అని నిధి చాలా క్లారిటీగా చెబుతోంది. అంటే తన జీవితంలో ఎవరూ లేనట్టేనా?