ప్రఖ్యాత హాలీవుడ్ కథానాయిక ఏంజెలీనా జోలీ తన భర్త బ్రాడ్ పిట్ నుంచి 2016 లో విడిపోయారు. విడాకుల విచారణ సమయంలో బ్రాడ్ పిట్ పై జోలీ గృహ హింస కేసును నమోదు చేశారు. కోర్టులో దీనిని నిరూపించడానికి ఆధారాలు సేకరించారు. మార్చి 12 న కేసు నమోదు చేసిన తరువాత తన వెర్షన్ను నిరూపించడానికి ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు న్యాయ అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఏంజెలిన్ జోలీ - బ్రాడ్ పిట్ పెళ్లాడిన రెండేళ్లకే విడాకులు తీసుకోవడం అప్పట్లో సంచలనమైంది. 2019 ఏప్రిల్ లో చట్టబద్ధంగా విడిపోయినట్లు ఈ జంట ప్రకటించారు. విడాకుల విచారణ సమయంలో బ్రాడ్ పిట్ ను ఎఫ్ బిఐ దర్యాప్తు చేసింది.
జోలీ ఇప్పుడు మాజీ భర్త గృహ హింసపై రుజువులతో సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వారి మైనర్ పిల్లల సాక్ష్యాలను కూడా ఈ కేసులో చేర్చారు. ఈ జంట పిల్లలను ఉమ్మడి కస్టడీకి కోరుతున్నట్లు సమాచారం - మాడాక్స్ (19)- పాక్స్ (17)- జహారా (16)- షిలో (14).. కవలలు నాక్స్ మరియు వివియన్నే (12) కూడా సాక్ష్యం చెప్పనున్నారు. అయితే బ్రాడ్ పిట్ కు చెందిన సన్నిహిత వర్గాలు తాజా సంఘటనలపై స్పందించి ఏంజెలీనా తన కథనాన్ని పూర్తిగా మార్చేసిందని వ్యాఖ్యానించారు. ఇకపోతే యాంజెలీనా పలు యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ మెప్పించడమే గాక.. నిర్మాతగానూ కొనసాగుతున్నారు. ఈ సమయంలో విడాకులు గొడవలు యాంజెలీనా- బ్రాడ్ కెరీర్ కి ఆటంకంగా మారాయి.