మహేష్ అమెరికా ట్రిప్ గురించి చాలా ముందే లీకులందిన సంగతి తెలిసిందే. అంతకుముందే భార్య నమ్రతా శిరోద్కర్.. కుమారుడు గౌతమ్ ఘట్టమనేని.. కుమార్తె సితార కుటుంబ సెలవుదినం కోసం తెలియని ప్రదేశానికి బయలుదేరారు. ఆదివారం అతను తన వారసులు గౌతమ్ -సితారా తో కలిసి ఫేస్ మాస్క్ లతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోకి ఇప్పటికి మామూలు పరిస్థితికి అలవాటు పడుతున్నాం అంటూ క్యాప్షన్ ని ఇచ్చారు మహేష్.
కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తికి ముందు మహేష్ బాబు అతని కుటుంబ సభ్యులు తరచూ ప్రయాణాలు చేసేవారు. మిగతా వారిలాగే మహేష్ కుటుంబం సుమారు ఎనిమిది నెలలుగా ఇంట్లోనే ఉండిపోయింది. అయితే ఇప్పుడు మహేష్ తిరిగి పని ప్రారంభించక ముందే సెలవును కుటుంబంతో ఆస్వాధించాలని నిర్ణయించుకున్నాడు.
విమానాశ్రయంలో ఫేస్ మాస్క్ లతో ఫోటోల్ని షేర్ చేశాక..``మమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తున్నారు !! అన్ని సురక్షితమైన వాటితో విమానయానానికి సన్నద్ధమయ్యాం. లైఫ్ బ్యాక్ ఆన్ ట్రాక్! జెట్ సెట్ గో!`` అంటూ ఉల్లాసకరమైన వ్యాఖ్యను జోడించారు.
జనవరిలో `సర్కారు వారి పాట` షూటింగ్ ను ప్రారంభించడానికి మహేష్ బాబు ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన షెడ్యూల్ ని యుఎస్ లో చిత్రీకరించనున్నారు. ఇటీవలే `సర్కారు వారి పాట` బృందం కీర్తి సురేష్ ను కథానాయికగా స్వాగతించింది.
మహేష్ బాబు ఈ సంవత్సరం తన తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించనున్నారు. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో చక్కని సోషల్ మెసేజ్ తో పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుందని భావిస్తున్నారు. `సర్కారు వారి పాట` తారాగణం ..టెక్నీషియన్లపై మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.