క్వీన్ కంగన టైటిల్ పాత్రలో నటించిన సినిమా `మణికర్ణిక- ది క్వీన్ ఝాన్సీ`. వీరనారి ఝాన్సీ రాణి జీవితకథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం జనవరి 25న రిలీజవుతోంది. రిపబ్లిక్ డే కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు కంగన బృందం సన్నాహకాల్లో ఉంది. ఇక ఈ చిత్రాన్ని కళ్లు భైర్లు కమ్మే బడ్జెట్ తో రూపొందించారన్న సంగతి తాజాగా రివీలైంది. ఏకంగా రూ.125 కోట్ల బడ్జెట్ వెచ్చించి మణికర్ణిక చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది. ఒక మహిళా ప్రాధాన్యత ఉన్న కథాంశాన్ని ఎంచుకుని జీ స్టూడియోస్ ఈ తరహా ప్రయత్నం చేయడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
తాజాగా ప్రమోషన్ కార్యక్రమాల్లో మాట్లాడిన కంగన `మణికర్ణిక- ది క్వీన్ ఝాన్సీ` చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించామని తెలిపారు. దీనిని సౌత్ లో రీమేక్ చేయొచ్చు కదా? అని కంగనను ప్రశ్నిస్తే.. అస్సలు అలాంటి పని చేయొద్దని దర్శక నిర్మాతలకు సూచించింది. మణికర్ణిక చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలోకి అనువదించి రిలీజ్ చేస్తున్నారు. ఒరిజినల్ ఫ్లేవర్ తో చూస్తేనే కిక్కు వస్తుందని కంగన చెబుతోంది. రీమేక్ ఐడియా సరి కాదని వారించే ప్రయత్నం చేయడం ఆసక్తికరం.
ఇక ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ లో ఉండగానే దర్శకుడు క్రిష్ తో కంగనకు విభేధాలొచ్చాయని ప్రచారమైన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే పెండింగ్ పార్ట్ కి కంగన స్వయంగా దర్శకత్వం వహించింది. క్రిష్ తో విభేధాలొచ్చాయన్న ప్రచారం సరికాదు.. డైరెక్టర్ గా తెర పై క్రిష్ పేరు వేస్తున్నామని ఇది వరకూ కంగన ప్రకటించింది. బహుశా క్రిష్ - కంగన అంటూ ఇద్దరి పేర్లను తెరపై కార్డ్ వేస్తారని అభిమానులు భావిస్తున్నారు. ఇదివరకూ రిలీజ్ చేసిన ట్రైలర్ కి మిక్స్ డ్ రివ్యూలు వచ్చిన సంగతి తెలిసిందే.