హార్రర్ కామెడీ.. మన దగ్గర అరిగిపోయిన జానర్. ‘ప్రేమకథా చిత్రమ్’ తర్వాత ఇబ్బడిముబ్బడిగా ఈ జానర్లో సినిమాలొచ్చాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. ఐతే ఈ మధ్య జనాలకు మరీ మొహం మొత్తేయడంతో ఆ జానర్లో సినిమాలు తగ్గిపోయాయి. ఐతే తెలుగు సినిమాల స్ఫూర్తితో తమిళంలోనూ వరుసగా హార్రర్ కామెడీలు వరుస కట్టేస్తున్నాయి. గత రెండేళ్లలో అక్కడ ఈ జానర్లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాళ్లకింకా మొహం మొత్తలేదు. తాజాగా అక్కడ ‘జాక్సన్ దురై’ పేరుతో ఓ వెరైటీ హార్రర్ కామెడీ తయారైంది. అందులో సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. మిర్చి.. బాహుబలి లాంటి సినిమాలతో తెలుగులోనూ సత్యరాజ్ కు మంచి ఫాలోయింగ్ వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని ‘దొర’ సినిమాతో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. జులై 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ తో సినిమా ఎలా ఉంటుందో రుచి చూపించే ప్రయత్నం చేసింది సత్య రాజ్ అండ్ కో.
హార్రర్ కామెడీలో ఎప్పుడూ ఉండే కాన్సెప్టే ఇందులోనూ కనిపిస్తోంది. ఓ పెద్ద భవనం.. అందులో ఏదో మిస్టరీ ఉంటుంది. దయ్యాలు తిరుగుతున్నాయని అందరూ అనుకుంటూ భయపడుతుంటారు. హీరో దాని సంగతేంటో తేలుస్తానని.. ఓ కామెడీ బ్యాచ్ ను వేసుకుని ఆ బిల్డింగ్ లోకి వెళ్తాడు. తీరా అక్కడికెళ్తే విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. దయ్యాల మధ్య ఇరుక్కుపోతారు. కాకపోతే ‘దొర’కు సంబంధించి విశేషం ఏంటంటే.. ఇందులో లోకల్ దయ్యాలతో పాటు ఫారిన్ దయ్యాలు కూడా ఉంటాయి. ఈ రెండు వర్గాల మధ్య పోరు సాగుతుంటుంది. దయ్యంగా సత్యరాజ్ లుక్ భలేగా ఉంది ఇందులో. సత్యరాజ్ కొడుకు శిబిరాజ్ - బిందుమాధవి హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమాకు ధరణీధరణ్ దర్శకుడు.
Full View