పవన్ కళ్యాణ్ హీరోగా కనిపించే సినిమా కోసం రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. గబ్బర్ సింగ్-2 ఇదిగో అదిగో అంటూనే రెండేళ్లు నెట్టుకొచ్చేశాడు పవన్. ఎట్టకేలకు ఆర్నెల్ల కిందట ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లిపోయింది. షూటింగ్ ఎంత పూర్తయింది.. ఇంకా ఎంత మిగిలుంది.. పోస్ట్ ప్రొడక్షన్ సంగతులేంటి అన్నది క్లారిటీ లేదు. కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇచ్చేశారు. ఏప్రిల్ 8న పక్కా అంటే పక్కా అని గత నెలలో నొక్కి వక్కాణించాడు నిర్మాత శరత్ మరార్. కానీ నిజంగా ఆ రోజు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలవుతుందా అన్నది మాత్రం సందేహంగానే ఉంది. ఎందుకంటే రిలీజ్ డేట్ కు అటు ఇటుగా నెలల రోజులు మాత్రమే సమయముందిక.
ఈపాటికి సినిమా దాదాపుగా పూర్తయిపోయి ఉండాలి. ఆడియోకు సన్నాహాలు చేస్తుండాలి. కానీ ఆడియో వేడుకను మార్చిలోనే చేయాలనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి కానీ.. ఇంకా డేటు ఫిక్సవ్వలేదు. వేదికేదో తెలియడం లేదు. అసలు సినిమా షూటింగ్ పూర్తయినట్లు కూడా సమాచారం ఏదీ లేదు. రామోజీ ఫిలిం సిటీలో ఒకటికి రెండు యూనిట్లు పెట్టి శరవేగంగా షూటింగ్ చేయిస్తున్నట్లు చెబుతున్నారు కానీ.. ఇంతకుముందంతా అంత తాపీగా ఉండి.. ఇప్పుడు హడావుడి పడితే ఔట్ పుట్ తేడా కొట్టేసే ప్రమాదముంది. సంక్రాంతికైతే ఆ డేటు దాటితే మళ్లీ అన్ సీజన్ మొదలైపోతుందన్న కంగారుంటుంది కానీ.. వేసవికి ఆ ప్రమాదం లేదు. ఏప్రిల్ 8న కాదంటే రెండు మూడు వారాలు వెనక్కి వెళ్లినా పోయేదేం లేదు. కాకపోతే మిగతా సినిమాల షెడ్యూళ్లు కూడా మార్చుకోవాల్సి ఉంటుందంతే. అందుకే వాయిదా ఆలోచన వచ్చినా ఆశ్చర్యమేమీ లేదు. పవన్ సినిమాకు ప్రత్యేకంగా ప్రమోషన్ ఎందుకులే అనుకోవచ్చు కానీ.. ఈ రోజుల్లో ప్రమోషన్ అన్నది చాలా ముఖ్యం. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తీరు చూస్తుంటే ఇంకా షూటింగ్ హడావుడిలోనే తలమునకలైనట్లుగా ఉంది. సినిమా ఎగ్జాక్ట్ పొజిషన్ ఏంటన్నది ఎవరూ చెప్పలేరు కానీ.. సినిమా అయితే ఏప్రిల్ 8న రావడం కష్టమే అని మాత్రం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పవన్ అండ్ కో ఆలోచన ఎలా ఉందో?