వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్నాడు. అది కాకుండా ఇప్పటికే నారప్ప సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్దం చేసి ఉంచాడు. మరో వైపు దృశ్యం 2 సినిమా కూడా షూటింగ్ దాదాపుగా ముగిసినట్లుగా సమాచారం అందుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే నారప్ప సినిమా ను మొదట విడుదల చేసి ఆ తర్వాత నెల లేదా నెలన్నర గ్యాప్ లో దృశ్యం 2 ను విడుదల చేయాలని సురేష్ బాబు అనుకున్నారు. కాని కరోనా సెకండ్ వేవ్ ఆయన ప్లాన్ మొత్తం రివర్స్ చేసింది. ఆయన ప్రస్తుతం విడుదల విషయంలో కన్ఫ్యూజన్ లో పడేలా చేసింది.
నారప్ప సినిమా ను కరోనా వల్ల వాయిదా వేస్తున్నాం.. ఆరోగ్యం ముఖ్యం కనుక సినిమా విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తాం అంటూ అధికారికంగా తెలియజేశారు. అయిదే దృశ్యం 2 విషయంలో మాత్రం సురేష్ బాబు క్లారిటీ తో లేనట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా ను థియేటర్ లోనే విడుదల చేయాలని సురేష్ బాబు భావిస్తుంటే ఇతర నిర్మాతలు మాత్రం దృశ్యం 2 ను ఓటీటీ లో విడుదల చేద్దాం అంటూ ఒత్తిడి చేస్తున్నారట. దాంతో దృశ్యం 2 ను ఓటీటీ లో విడుదల చేయడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
దృశ్యం 2 ను మొదటి నుండి కూడా జూన్ లో విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే జూన్ లోనే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నారట. అయితే అది ఓటీటీలో అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తున్నాయి. దృశ్యం 2 తక్కువ బడ్జెట్ తో తక్కువ సమయంలోనే పూర్తి చేశారు కనుక ఓటీటీలో విడుదల అయినా లాభమే అన్నట్లుగా మేకర్స్ భావిస్తున్నారు.
ఆలస్యం చేయడం వల్ల దృశ్యం 2 పై జనాల్లో ఆసక్తి తగ్గుతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కనుక నారప్ప కంటే ముందే దృశ్యం 2 ను విడుదల చేస్తారు.. కాని ఓటీటీ లో అంటూ విశ్వసనీయ సమాచారం అందుతోంది. అసలు విషయం ఏంటీ అనేది సురేష్ ప్రొడక్షన్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు చెప్పలేం.