టాలీవుడ్ కంటే ముందు బాలీవుడ్‌ లో...!

Update: 2021-10-01 03:30 GMT
ఈ మద్య కాలంలో స్టార్‌ హీరోలు పలువురు రీమేక్ లపై పడ్డారు. సౌత్ సినిమాలు ఎక్కువగా బాలీవుడ్‌ లో రీమేక్ అవుతున్నాయి. తెలుగు.. తమిళ.. మలయాళ సినిమాలు అన్ని కలిపి బాలీవుడ్‌ లో ఏకంగా డజను వరకు రీమేక్ అవుతున్నాయి. చిన్న హీరోలు పెద్ద హీరోలు కూడా బాలీవుడ్‌ లో సౌత్‌ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ఈ సమయంలో మరో సౌత్ సినిమా బాలీవుడ్‌ లో రీమేక్ కు సిద్దం అయ్యింది. మలయాళంలో సూపర్‌ హిట్ అయిన డ్రైవింగ్ లైసెస్స్ సినిమా ను తెలుగు లో స్టార్‌ హీరో రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నారు.. రీమేక్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. కాని టాలీవుడ్‌ లో డ్రైవింగ్‌ లైసెన్స్ పట్టాలెక్కలేదు. ఇప్పట్లో తెలుగు రీమేక్ ఉంటుందనే సమాచారం కూడా లేదు. టాలీవుడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్ గురించిన చర్చలు పక్కకు వెళ్లిన సమయంలో బాలీవుడ్ లో డ్రైవింగ్‌ లైసెన్స్ పట్టాలెక్కబోతున్నట్లుగా ప్రకటన వచ్చేసింది.

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఈ రీమేక్ ను చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కరణ్‌ జోహార్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. డ్రైవింగ్‌ లైసెన్స్ లో ఇద్దరు హీరోలు ఉంటారు. మలయాళంలో పృథ్వీ మరియు సూరజ్‌ లు నటించారు. ఆ పాత్రల్లో ఇప్పుడు అక్షయ్‌ కుమార్ మరియు ఇమ్రాన్ హష్మిలు నటించబోతున్నారు. ఈ రీమేక్ కు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ కూడా ముగించినట్లుగా సమాచారం అందుతోంది. ఈ రీమేక్ ను రాజ్ మెహత దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈమద్య కాలంలో సౌత్‌ సినిమాలకు రీమేక్ గా రూపొందిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ ఎత్తున వసూళ్లు దక్కించుకున్న బాలీవుడ్‌ సినిమాలు మరిన్ని రీమేక్‌ కు ప్రేరణగా నిలుస్తున్నాయి.

హిందీ రీమేక్ సూపర్‌ హిట్ అయితే అప్పుడు అయినా తెలుగు మేకర్స్ రీమేక్ పై ఆసక్తి చూపిస్తారేమో చూడాలి. టాలీవుడ్‌ లో కూడా ఈమద్య కాలంలో మలయాళ సినిమాలు వరుసగా రీమేక్ అవుతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే డ్రైవింగ్‌ లైసెన్స్ తెలుగు రీమేక్ వచ్చే ఏడాదిలో తెలుగు మేకర్స్ పట్టాలెక్కిస్తారేమో చూడాలి. ప్రముఖ నిర్మాత ఈ రీమేక్ రైట్స్ ను దగ్గర పెట్టుకున్నాడు. పలువురు హీరోలు ఈ రీమేక్ పై ఆసక్తిగా ఉన్నా కూడా ఆయన మనసులో మాత్రం వేరే వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారు ఎవరు.. ఇంతకు రీమేక్ ఎప్పుడు ఉంటుంది అనే విషయంపై క్లారిటీ వచ్చే వరకు బాలీవుడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్ ముగిసి ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Tags:    

Similar News