మలయాళంలో పెద్ద హీరోల సినిమాలు సూపర్ హిట్టయినా పాతిక కోట్ల వసూళ్లు వస్తే ఔరా అంటారు. అక్కడ 30 కోట్లు వసూలు చేసినా బ్లాక్‌బస్టర్ స్టేటస్ ఇచ్చేస్తారు. అలాంటిది రెండేళ్ల కిందట వచ్చిన 'దృశ్యం' ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మోహన్‌లాల్ హీరోగా జీతు జోసెఫ్ రూపొందించిన ఈ థ్రిల్లర్ పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై సంచలన విజయం సాధించింది. దీంతో మిగతా ఇండస్ట్రీల నుంచి రీమేక్ కోసం ఆఫర్లే ఆఫర్లు. ముందుగా తెలుగులో వెంకటేష్ హీరోగా 'దృశ్యం' తీస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్టయింది. సోలో హీరోగా వెంకీకి చాన్నాళ్ల తర్వాత ఓ మంచి హిట్టు దక్కింది.
ఆ తర్వాత తమిళంలో కమల్ హాసన్ హీరోగా మలయాళ మాతృక దర్శకుడు జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే 'పాపనాశం' పేరుతో తెరకెక్కిస్తే ఇక్కడా సినిమా సూపర్ హిట్ టాక్‌తో నడుస్తోంది. మలయాళంలో దొర్లిన కొన్ని తప్పుల్ని కూడా దిద్దుకుని.. మరింత ఆసక్తికరంగా తమిళ వెర్షన్‌ను రూపొందించాడు జీతు. మలయాళం, తమిళంలో కంటే బెస్ట్ అని అంటున్నారు క్రిటిక్స్. తమిళంలో కూడా ఈజీగా 50 కోట్లు రాబట్టేలా ఉంది పాపనాశం. మూడు భాషల్లోనూ విజయవంతమైన దృశ్యం ఇక హిందీలో సత్తా చాటాల్సి ఉంది. అక్కడ 'దృశ్యం' పేరుతోనే అజయ్ దేవగన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఇంకో రెండు వారాల్లో హిందీ దృశ్యం విడుదల కాబోతోంది. మరి అక్కడ ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.