దుల్కర్ సల్మాన్ సౌత్ మొత్తంలో సినీప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈమధ్యే హిందీలో 'కార్వాన్' చిత్రంతో అడుగుపెట్టాడు. తాజాగా 'జోయా ఫ్యాక్టర్' అనే మరో బాలీవుడ్ చిత్రం లో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఒక న్యూస్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
దుల్కర్ మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడన్న విషయం తెలిసిందే. కానీ సినిమాల్లోగానీ.. బయటగానీ అయనపేరు ను ఉపయోగించుకోకూడదని మొదట్లోనే నిర్ణయం తీసుకున్నాడట. మరోవైపు దుల్కర్ 'మహానటి' లో జెమిని గణేశన్ పాత్రలో నటించి అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ తర్వాత కొంతమంది లేడీ ఫ్యాన్స్ తన సోషల్ మీడియా పేజిలో 'ఐ హేట్ యూ' అంటూ కామెంట్స్ పెట్టారట. అన్నీ సినిమాల్లో ఒకరకంగా ఉండే పాత్రలు ఎన్ని సార్లని చేస్తామని.. అందుకే నెగెటివ్ రోల్ అయినా యాక్సెప్ట్ చేసినట్టు చెప్పాడు. అంతే కాదు సినిమాలో ఆ పాత్ర చాలా ముఖ్యమైనదని తెలిపాడు. "నేను చేసిన సినిమా హిట్ అవ్వాలని కాదు.. మంచి సినిమా లో నేనుండాలని కోరుకుంటా" అని చెప్పాడు.
ఇక వెటరన్ ఫిలిం మేకర్ మణిరత్నం గురించి మాట్లాడుతూ ఒక నటుడిగా "నాకున్న గోల్స్ లో మణిరత్నం సర్ తో పనిచేయడం ఒకటి. 'ఓకే బంగారం' సినిమాతో ఆ కోరిక తీరింది. ఆ సినిమాతో జాతీయ స్థాయిలో నాకు మంచి పేరొచ్చింది. మణిరత్నం సార్ తో సినిమా అంటే హార్వార్డ్.. స్టాన్ ఫర్డ్ లో సీట్ సాధించినట్టే" అన్నాడు. అందుకేగా ఆయన్ను మణి 'సార్' అని అందరూ పిలిచేది!