బలమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన దుల్కర్ సల్మాన్, మలయాళంలోనే కాదు తమిళ .. తెలుగు భాషల్లోను మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. 'ఓకే బంగారం' .. 'మహానటి' సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. నేరుగా తెలుగులో ఒక సినిమా చేయాలని ఆయన నిర్ణయించుకోవడం .. హను రాఘవపూడి దర్శకత్వంలో 'సీతా రామం' పట్టాలెక్కడం జరిగిపోయింది. ఈ సినిమా ఈ నెల 5వ తేదీన థియేటర్లలో దిగిపోనుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ చీఫ్ గెస్టుగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి జరిగింది.
ఈ వేదికపై దుల్కర్ మాట్లాడుతూ .. "వైజయంతీ మూవీస్ వంటి ఒక పెద్ద బ్యానర్ లో ఇంత మంచి సినిమా చేసే అవకాశం వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఈ ఈవెంట్ కి రావడం నాకు మరింత సంతోషాన్ని కలిగించే విషయం. ప్రభాస్ గారు .. నాగ్ అశ్విన్ గారు 'ప్రాజెక్టు K' చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. నేను ఈ సినిమా చేస్తున్న సమయంలో ఎంత మాత్రం వీలున్నా ఆ సినిమా సెట్ కి వెళ్లి వచ్చేవాడిని. అక్కడికి వెళితే మరో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగా ఉండేది.
'ప్రాజెక్టు K' పని తీరును పరిశీలించిన తరువాత నాకు ఒకటే విషయం అర్థమైంది. ఇది ప్రభాస్ - నాగ్ అశ్విన్ కలిసి చేస్తున్న ప్రయోగం. సాహసాలు చేయడం వాళ్లకి మాత్రమే సాధ్యమవుతుందని నిరూపించే సినిమా ఇది.
ఈ సినిమా ఇండియన్ సినిమాకే గర్వకారణంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు .. ఈ విషయానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఇక 'సీతా రామం' విషయానికి వస్తే .. ఈ సినిమాకి పనిచేయడం పూర్తయిందనే ఆలోచనే చాలా బాధ కలిగిస్తోంది. ఈ సినిమా కోసం స్వప్న దత్ కష్టపడిన తీరును చూసి నేను ఆశ్చర్యపోయాను.
దర్శకుడు హను రాఘవపూడి తన కలను నిజం చేసుకోవడానికి ఎంత కష్టమైనా పడతాడు. ఈ సారి ఆయన డ్రీమ్ లో నేను కూడా భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా షూటింగు కోసం ఎన్నో లొకేషన్స్ కి వెళ్లాను. మరే సినిమా షూటింగు కోసం నేను ఇన్ని ప్రాంతాలకు తిరగలేదు. సీత పాత్రను మృణాల్ అద్భుతంగా చేసింది. ఆమె తప్ప ఆ పాత్రను వేరెవరూ చేయలేరని ప్రతి ప్రతి ఒక్కరూ అంటారు.
ఇకపై ఆమె అసలు పేరు మరిచిపోయి 'సీతామాలక్ష్మి' అని పిలిచినా ఆశ్చర్యం లేదు. స్క్రీన్ పై మా జంటకు మంచి మార్కులు పడినందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చాడు.