మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ లో క్రేజ్ ఏర్పరచుకున్న మమ్ముట్టి.. 'సూర్య పుత్రులు' 'స్వాతి కిరణం' 'యాత్ర' వంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కూడా చేశారు. ఇప్పుడు అఖిల్ 'ఏజెంట్' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మలయాళంలో సీనియర్ స్టార్ హీరోగా రాణిస్తున్న మమ్ముట్టి.. అవకాశం వచ్చినప్పుడు ఇతర భాషల్లో కూడా అలరిస్తున్నారు. భాష ఏదైనా పాత్ర ఎలాంటిదైనా దానిలో పరకాయ ప్రవేశం చేసే మమ్ముట్టి.. 400 సినిమాలకు పైగా నటించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది 'మలయాళ మెగాస్టార్' ని చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆయన వారసుడు దుల్కర్ సల్మాన్ కూడా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు.
ముహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్ నుంచి మమ్ముట్టిగా మారిన మెగాస్టార్.. ఈరోజు తన 70వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులతో పాటుగా సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తనయుడు దుల్కర్ కూడా తండ్రికి స్పెషల్ బర్త్ డే విషెస్ అందజేశారు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు పా.. మీరు రివర్స్ లో వయస్సును కొనసాగించవచ్చని కోరుకుంటున్నాను. ఎప్పటికీ సో గ్రేట్ ఫుల్ అండ్ సో బ్లెస్డ్' అని దుల్కర్ సల్మాన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి మమ్ముట్టి తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్ డే పా' 'లెజెండ్' 'సూపర్ హీరో' 'వితవుట్ కేప్' అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించారు దుల్కర్.
ఇక సినిమా విషయానికొస్తే.. 2021లో 'ది ప్రీస్ట్' 'వన్' వంటి చిత్రాలతో పలకరించిన మమ్ముట్టి.. ప్రస్తుతం 'భీష్మ పర్వం' 'పాతామ్ వలవు' 'పూజహు' వంటి1చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు దుల్కర్ సల్మాన్ 'ఓకే బంగారం' చిత్రంతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకొని.. 'మహానటి' వంటి సూపర్ హిట్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది 'కనులు కనులను దోచాయంటే' చిత్రంతో మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం వైజయంతీ మూవీస్ బ్యానర్ లో హను రాఘవపూడి దర్శకత్వంలో 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనే బైలింగ్వల్ సినిమా చేస్తున్నాడు. అలానే 'కురూప్' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో పాటుగా మలయాళంలో 'సెల్యూట్' - తమిళంలో 'హే సినామిక' వంటి చిత్రాల్లో దుల్కర్ నటిస్తున్నాడు.