డమ్మీ స్టార్ vs రీమేక్ స్టార్

Update: 2020-04-01 11:30 GMT
సినీ ఇండస్ట్రీలో హీరోలు ఎంత కలిసి మెలసి ఉన్నా వారి ఫ్యాన్స్ మాత్రం తరచూ గొడవ పడుతూ ఉంటారు. ఒకరినొకరు దూషించుకుంటూ తలలు బద్దలు కొట్టుకుంటారు కూడా. 'మేము మేము బాగానే ఉంటాం.. కానీ మీరే' అంటూ హీరోలే డైరెక్టుగా చెప్పిన గొడవలు మాత్రం ఆపరు. సినీ ఇండస్ట్రీ కాలానుగుణంగా మారుతూ వస్తున్నా హీరోల అభిమానులు మాత్రం మారడం లేదు. ఇంకా అలానే ఒకరిపై మరొకరు ద్వేషంతో విమర్శలు చేసుకోవడం కూడా ఎక్కువైంది. ఒకప్పుడు ఈ సోషల్ మీడియా వంటివి లేకపోవడంతో థియేటర్స్ లేదా రోడ్ల మీద ఫ్యాన్స్ గొడవ పడేవారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికి వారు తమకు నచ్చని హీరోలపై ద్వేషంతో రగిలిపోతూ మీడియా వేదికల్లో కామెంట్స్ చేసుకోడం వాళ్ళకి మామూలైపోయింది.

ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో విజయ్ ఫ్యాన్స్ వివాదానికి దిగడంతో ఒకరి హీరోపై మరొకరు రగిలిపోతూ కామెంట్స్ చేసుకోవడం మొదలెట్టారు. వీళ్ళ ఇద్దరి ఫ్యాన్స్ వార్ ఎక్స్ ట్రీమ్ లెవెల్ కి వెళ్ళింది. అంతటితో ఆగకుండా 'డమ్మీ స్టార్ మహేష్ బాబు' అంటూ విజయ్ ఫ్యాన్స్ మహేష్ పై ట్రోల్ చేస్తుండగా, 'రీమేక్ స్టార్ విజయ్' అంటూ మహేష్ ఫ్యాన్స్ విజయ్ పై ట్రోల్స్ చేయడం మొదలెట్టారు. ఈ ట్రోలింగ్ విపరీతంగా పెరగడంతో నేషనల్ వైడ్ ట్విట్టర్ ట్రెండ్ లో ఇవి రెండూ కూడా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి గురించి ఆందోళన చెందుతూ ఎవరి బాధల్లో వారుంటే ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో సిల్లీగా ట్రోల్ చేసుకుంటున్నారు. మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో వీళ్ల ఫ్యాన్స్ ని చూసి నవ్వుకుంటున్నారు. దేశం మొత్తం కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఇలా బిహేవ్ చేయడం మంచిది కాదని సలహా ఇస్తున్నారు. ఏదేమైనా మహేష్ విజయ్ ఫ్యాన్స్ అభిమానానికి హద్దులు లేకుండా పోతున్నాయని అందరూ విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు హీరోలకు బయట మంచి సఖ్యత ఉందని, కానీ వారి అభిమానులు మాత్రం ఈ విధంగా గొడవలు పడుతూ వారి స్థాయిని తగ్గించడం సరైనది కాదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా తమ అభిమాన హీరోలు కలుగజేసుకొని చెప్పినా ఈ ఫ్యాన్స్ గొడవలు మాత్రం ఆగేలాలేవు.
Tags:    

Similar News