దుర్గామతి ట్రైల‌ర్: భాగ‌మ‌తి ఫియ‌ర్ సస్పెన్స్ య‌థాత‌థంగా..!

Update: 2020-11-25 07:00 GMT
హార‌ర్ థ్రిల్ల‌ర్ అన‌గానే అందులో స‌స్పెన్స్ ఎలిమెంట్ బ‌లంగా వ‌ర్క‌వుట్ కావాలి. పైగా ఇన్వెస్టిగేష‌న్ .. అధికారుల హంగామా అంటే ఆ మేర‌కు క్యూరియాసిటీ ఉంటుంది. అయితే ప్ర‌తిచోటా లాజిక్ వ‌ర్క‌వుట్ కావాలి. ఇక లేడీ ఓరియెంటెడ్ కథాంశం .. అమ్మ‌వారి పూన‌కం త‌ర‌హా క్యారెక్ట‌రైజేష‌న్ .. స్క్రిప్టులోనే క‌న్ ట్విస్టులు వ‌ర్క‌వుటైతే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.

ఇలాంటి ర‌క‌ర‌కాల ఎలిమెంట్స్ ని వ‌ర్క‌వుట్ చేస్తూ అనుష్క టైటిల్ పాత్ర‌లో జి.అశోక్ తెర‌కెక్కించిన భాగ‌మతి(తెలుగు) ఎంత‌టి స‌క్సెసైందో తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాని బాలీవుడ్ లో దుర్గామ‌తి (దుర్గావ‌తి టైటిల్ మారింది) అశోక్ రీమేక్ చేస్తున్నారు. అనుష్క న‌టించిన పాత్ర‌లో భూమి ఫెడ్నేక‌ర్ న‌టించ‌గా.. బాలీవుడ్ ప్ర‌ముఖ తార‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

తాజాగా రిలీజైన ట్రైల‌ర్ లో స‌స్పెన్స్ ఎలిమెంట్ తెలుగు వెర్ష‌న్ తీరుగానే వ‌ర్క‌వుటైంది. టెన్స‌న్ సస్పెన్స్.. ఫియ‌ర్ ఫ్యాక్ట‌ర్ అనేవి ర‌న్ చేయ‌డంలో ఎగ్జ‌యిటింగ్ విజువ‌ల్స్ ని ప్రెజెంట్ చేయ‌డంలో తెలుగు ద‌ర్శ‌కుడు అశోక్ అక్క‌డా స‌క్సెస‌య్యారు. ఇక దుర్గామ‌తిగా అమ్మ‌వారి త‌ర‌హా పెర్ఫామెన్స్ లో భూమి ఫెడ్నేక‌ర్ న‌ట‌న‌నే వేలెత్తి చూప‌లేం. ఈ ప్ర‌తిభావ‌ని విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్ని ఎంచుకుని వాటికి జీవం పోస్తుంటుంది. అందుకే బాలీవుడ్ లో ఎంద‌రు నాయిక‌లు ఉన్నా త‌న‌కంటూ ఒక రేంజుంద‌ని నిరూపిస్తోంది. దుర్గామ‌తి ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. ఇందులో అక్ష‌య్ కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. త్వ‌ర‌లోనే సినిమా రిలీజ్ కానుంది. హిందీ వెర్ష‌న్ ఏ మేర‌కు స‌క్సెస్ కానుంది అన్న‌ది వేచి చూడాలి.


Full View
Tags:    

Similar News