అక్కడ దసరా ఇంకా సెట్టవ్వలేదా?

Update: 2017-07-24 04:57 GMT
ఒక పెద్ద స్టార్ హీరో సినిమా విడుదల అవుతుంది అంటే రెండు తెలుగు రాష్ట్రాల సినిమా అభిమానులు కోలాహలం అంతా ఇంత కాదు. మామూలు రోజు నాడు ఒక సినిమా విడుదల అయితే థియేటర్లు దగ్గర సందడి పండగ వాతావరణంలా అనిపిస్తే ఇంకా పండుగ రోజే ఆ సినిమా వస్తే ఇంకా ఎలా ఉంటుందో కదా. అందుకే ఈ సారి దసరాకు మన స్టార్ హీరోలు చాలామంది వస్తున్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ - జై లవ కుశ - మహేశ్ బాబు - స్పైడర్ ఇంకా బాలకృష్ణ  - పైసా వసూల్. ఈ మూడు సినిమాలు ఇంచు మించు దగ్గరదగ్గర తేదిలలో విడుదల కాబోతున్నాయి.

ఇప్పుడు తెలుగు సినిమా విడుదల అవుతుంది అంటే ఇక్కడ కలెక్షన్లే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ కలెక్షన్లు కూడా తోడు అవుతున్నాయి. దానితో మన ప్రొడ్యూసర్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ పై కూడా దృష్టి పెడుతున్నారు. కానీ లాభాలు ఎక్కువగా పొందాలనే ఆశతో.. ఇప్పుడు పై సినిమాలకు ఎక్కువ కోట్ చేస్తుంటే.. ఈ సినిమాలు కొనడానికి ఓవర్సీస్ లో జనాలు ముందుకు రావటంలేదని టాక్. మహేశ్ బాబు సినిమా ఓవర్సీస్ లో రైట్స్ కోసం ఇంకా ఒక కొలికిరాలేదు. స్పైడర్ సినిమా ప్రొడ్యూసర్లు ఓవర్సీస్ రైట్స్ ని  22-25 కోట్లు అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ అంత భారీ మొత్తానికి రైట్స్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రావటం లేదు. అందుకని  ఆ ప్రొడ్యూసర్లు కొంచెం  తగ్గించి అమ్మడానికి సిద్దపడినట్లు తెలుస్తుంది. స్పైడర్ లాంటి క్రేజీ కాంబినేషన్ సినిమాకు కూడా ఇంత వరకు బిజినెస్ డీల్ కుదరకపోవడం కాస్త చోద్యం గానే ఉంది కదూ.

అలానే మరో సినిమా జైలవ కుశ  సినిమా ఓవర్సీస్ రైట్స్ ముందు 15 కోట్లు చెప్పి ఇప్పుడు కొంచెం తగ్గించి అమ్మడానికి సరే అంటున్నారు ఆ సినిమా ప్రొడ్యూసర్లు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే మంచి బిజినెస్ డీల్ కుదుర్చుకున్నాయి కాని అక్కడ మాత్రం ఇంకా క్లోజ్ కాలేదు. బాలకృష్ణ హీరోగా వస్తున్న పైసా వసూల్ సంగతైతే.. ఈ సినిమా ఓవర్సీస్ డీల్ కుదరటం కష్టం గానే ఉందని తెలుస్తుంది. చూద్దాం ఫైనల్ గా ఈ సినిమాలు ఎలాంటి డీల్ క్లోజ్ చేస్తాయో!!
Tags:    

Similar News