ప్రీమియర్లు బెనిఫిట్ షోలు పడవంతే

Update: 2018-04-19 14:24 GMT
భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే.. ముందుగా అందరి దృష్టి ప్రీమియర్లపైనే ఉంటుంది. యూఎస్ ప్రీమియర్స్ ఎలాగూ పడతాయి లెండి. అవి కాస్త ఎక్కువ ధరకు అయినా.. అఫీషియల్ గా సేల్ అవుతాయి. కానీ మన దగ్గర బెనిఫిట్ షోలు.. పెయిడ్ ప్రివ్యూల పేరుతో వేలకు వేలు వసూలు చేసేసినా.. నిజానికి నిర్మాతకు దక్కేది నామమాత్రమే.

పైగా ఇలా ముందు రోజు రాత్రి కానీ.. అర్ధరాత్రి కానీ ప్రదర్శించే షోస్ కారణంగా పలు చిత్రాలకు కోలుకోలేనంత డ్యామేజ్ జరగడం కనిపించింది. రేపు రిలీజ్ అవుతున్న భరత్ అనే నేను విషయంలో కూడా బోలెడంత సమాలోచనలు జరిపిన నిర్మాతలు.. ఎట్టి పరిస్థితులోను ప్రీమియర్ల.. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకూడదని డిసైడ్ చేసుకున్నట్లు నిర్మాత డీవీవీ దానయ్య చెప్పేశారు. అయితే.. సినిమాపై ఉన్న భారీ అంచనాలను బేస్ చేసుకుని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఉదయాన్నే ప్రదర్శనలు ప్రారంభమవుతాయని వెల్లడించారు దానయ్య.

రీసెంట్ గా రిలీజ్ అయిన రామ్ చరణ్ మూవీ రంగస్థలం మూవీకి కూడా ఇదే టెక్నిక్ ను అనుసరించారు. ఇది బాగానే క్లిక్ అవడంతో.. ఇప్పుడు భరత్ అనే నేనుకు కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నారు. లండన్ లో చదువుకుంటున్న ఓ కుర్రాడు.. తన తండ్రి చనిపోవడం కారణంగా.. సడెన్ గా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి.. ఆ తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు.. వాటిని ఎలా ఎదిరించాడన్నదే భరత్ అనే నేను చిత్రం కథ అంటున్నారు.


Tags:    

Similar News