గోల్డెన్ గ్లోబ్ ఓకే..మ‌రి ఆయ‌న క‌నిపించ‌డే జ‌క్క‌న్నా?

Update: 2023-01-14 14:30 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌,యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ల తొలి కాంబినేష‌న్ లో రూపొందిన పాన్ ఇండియా వండ‌ర్ `RRR`. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన ఈ మూవీ ప్ర‌స్తుతం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిన విష‌యం తెలిసిందే. హాలీవుడ్ ప్ర‌ముఖులు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే గోల్డెన్ గ్లోబ్ పురస్కారానిని అనూహ్యంగా ఎంట్రీని సాధించ‌డ‌మే కాకుండా ది బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో `నాటు నాటు` పాట‌కు గానూ గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

దీంతో ఈ మూవీపై దేశం మొత్తం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తోంది. ప్ర‌ధాని నుంచి స్టేట్ లీడ‌ర్ల వ‌ర‌కు సినిమా టీమ్ ని అభినందిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ లు చేస్తున్నారు. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక కోసం అమెరికా వెళ్లిన రాజ‌మౌళి, కీర‌వాణి, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఫ్యామిలీస్ తో ఆవార్డుల వేడుక‌లో సంద‌డి చేశారు. ఆ త‌రువాత కూడా యుఎస్ లో జ‌రిగిన డైరెక్ట‌ర్స్ గిల్డ్ లో రాజ‌మౌళి పాల్గొన‌గా, కీర‌వాణితో పాటు రాజ‌మౌళి యుఎస్ లో జ‌రిగిన హాలీవుడ్ ప్ర‌ముఖుల పార్టీలో ప్ర‌త్యేకంగా పాల్గొన్నారు.

అదే పార్టీలో  `గాడ్ ఆఫ్ మూవీస్ గా అభివ‌ర్ణించే స్పీల్ బ‌ర్గ్ ని క‌లిసి ఆయ‌న సినిమాలంటే ఎంత ఇష్ట‌మో రాజ‌మౌళి వివ‌రించ‌గా త‌న‌తో పాటు కీర‌వాణి కూడా క‌లిసి స్టీవెన్ స్పీల్ బ‌ర్డ్ ఫొటోల‌కు పోజులిచ్చారు. ఆ ఫోటోలు నెట్టింట రాజ‌మౌళి, కీర‌వాణి అభిమానుల‌తో పంచుకున్నారు కూడా. అంతా బాగానే వుంది. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసి సినిమాని నిర్మించిన నిర్మాత డీవీవీ దాన‌య్య మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు అనే చ‌ర్చ ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్ లు అంటున్నారు.

గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాన్ని అందుకుంటున్న స‌మ‌యంలోనూ ర‌చ‌యిత చంద్ర‌బోస్ పేరుతో పాటు కాల‌భైర‌వ‌, రాహుల్ సిప్ల‌గంజ్ పేర్ల‌ని ప్ర‌స్తావించిన కీర‌వాణి మాట వ‌రుస‌కైనా నిర్మాత డీవీవీ దాన‌య్య పేరుని మాత్రం ప‌ల‌కక‌పోవ‌డం ఏంట‌ని అంతా అవాక్క‌వుతున్నారు. ద‌నీకి కార‌ణం లేక‌పోలేద‌ని, హాలీవుడ్ దృష్టిని `RRR` వైపు మ‌ళ్లించ‌డానికి  దాన‌య్య ఎలాంటి ఖ‌ర్చు చేయ‌లేద‌ని, అదంతా రాజ‌మౌళినే భ‌రించాడ‌ని, ఆ కార‌ణంగానే రాజ‌మౌళి కానీ కీర‌వాణి కానీ దాన‌య్య పేరుని ఎక్క‌డా వాడ‌టం లేద‌నే టాక్ వినిపిస్తోంది.

మ‌రి ఈ ప్ర‌చారంపై దాన‌య్య అయినా, రాజ‌మౌళి అయినా పెద‌వి విప్పుతారో లేక ఇలాగే సైలెంట్ అయిపోయి మ‌రిన్ని పుకార్ల‌కు ఊత‌మిస్తారో వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News