తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీలో మరోమారు తెరమీదకు వచ్చాయి. రెండు అడుగులు ముందుకు ఒక అడుగు వెనక్కు అన్నట్లుగా సఖ్యత ఎపిసోడ్ లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మరో ట్విస్ట్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శిని చేస్తేనే విలీనానికి అంగీకరిస్తామని పేర్కొంది. చిన్నమ్మ శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ మళ్లీ పార్టీ పగ్గాలు చేపడతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఓపీఎస్ వర్గం ఈ షరతు విధించింది.
తమ షరతు గురించి ఓపీఎస్ వర్గానికి చెందిన మాజీ మంత్రి - ఎమ్మెల్యే పాండ్యరాజన్ పన్నీర్ సెల్వం నివాసం వద్ద విలేకర్లతో మాట్లాడుతూ ‘పన్నీర్ సెల్వాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శిని చేస్తేనే విలీనం. పార్టీ శ్రేణులంతా మా వైపే ఉన్నాయి’ అని స్పష్టంచేశారు. ప్రజల్లోనూ, అటు పార్టీలోనూ తమ బలాన్ని నిరూపించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందుకోసం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
మరోవైపు రెండాకుల గుర్తు కోసం లంచం ఇచ్చిన కేసులో జైలు పాలు అయి అనంతరం బెయిల్‌పై వచ్చినప్పటి నుంచి దినకరన్ దూకుడు పెంచారు. చీలిక నేపథ్యంలో అన్నాడీఎంకే ఇరు వర్గాల విలీనం కోసం 60 రోజుల గడువు ఇచ్చిన టీటీవీ దినకరన్... అది జరగకుంటే తాను చేయాల్సింది చేస్తానని ఇదివరకే ప్రకటించారు. విలీనానికి పరిస్థితులు అంత సానుకూలంగా లేకపోవడంతో రాష్ట్రవ్యాప్త యాత్రకు కూడా ప్రణాళిక రచించారు. అందులో భాగంగా ఆగస్టు 5నుంచి యాత్ర చేయాలని సన్నాహాలు చేపడుతున్నారని సమాచారం. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి ఒక హెచ్చరికలా తన వర్గం ఎమ్మెల్యేతో దినకరన్ పదవికి రాజీనామా చేయించారు కూడా!. అన్నాడీఎంకే అమ్మ వర్గం ఎమ్మెల్యే, టీటీవీ దినకరన్ మద్దతుదారుడు, పెరుందురై నియోజకవర్గ శాసనసభ్యుడు తొప్పు వెంకటాచలం అసెంబ్లీ కమిటీ పదవికి రాజీనామా చేశారు. అధికారపార్టీలోని సభ్యుడు ఇలా ప్రాధాన్య పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో తమ పట్టు సడలకుండా ఉండేందుకు ఈ షరతును సెల్వం వర్గం పెట్టినట్లు సమాచారం.